IND vs PAK Tickets: ఒకేసారి 7 లక్షల మంది దండయాత్ర.. వెబ్‌సైట్ క్రాష్! హాట్‌కేకుల్లా అమ్ముడైన భారత్‌-పాక్‌ మ్యాచ్ టికెట్లు

India vs Pakistan Asia Cup 2022 Match Tickets sold out in minutes. భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌కు సంబంధించిన టికెట్లు హాట్‌కేకుల్లా అమ్ముడుపోయాయి.  

Written by - P Sampath Kumar | Last Updated : Aug 16, 2022, 03:10 PM IST
  • మరో 11 రోజుల్లో మెగా టోర్నీ
  • ఒకేసారి 7 లక్షల మంది దండయాత్ర
  • హాట్‌కేకుల్లా అమ్ముడైన భారత్‌-పాక్‌ మ్యాచ్ టికెట్లు
IND vs PAK Tickets: ఒకేసారి 7 లక్షల మంది దండయాత్ర.. వెబ్‌సైట్ క్రాష్! హాట్‌కేకుల్లా అమ్ముడైన భారత్‌-పాక్‌ మ్యాచ్ టికెట్లు

India vs Pakistan Asia Cup 2022 Match Tickets sold out in minutes: చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే.. మైదానంలో ఓ యుద్ధం వాతావరణం నెలకొంటుంది. ఇరు దేశాల అభిమానులే కాకుండా.. యావత్‌ క్రికెట్ ఫాన్స్ ఈ మ్యాచును ఎంతో ఆసక్తిగా తిలకిస్తారు. ఇండో-పాక్ మ్యాచ్ టిక్కెట్ల కోసం ఇరు దేశాల అభిమానులు ఎగబడతారు. ఇదే మరోసారి నిరూపితమైంది. భారత్‌-పాక్‌ మ్యాచ్ టికెట్లు హాట్‌కేకుల్లా అమ్ముడయిపోయాయి. ఓ సమయంలో అభిమానుల దండయాత్ర తట్టుకోలేక వెబ్‌సైట్ సైతం క్రాష్ అయిందంటే.. దాయాదుల పోరుకు ఎలాంటి క్రేజ్ ఉందో అర్ధం చేసుకోవచ్చు. 

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆసియా కప్ 2022 టోర్నీకి సమయం దగ్గరపడుతోంది. మరో 11 రోజుల్లో మెగా టోర్నీకి తెరలేవనుంది. ఆగస్టు 27న జరిగే మొదటి మ్యాచులో శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్‌ తలపడనున్నాయి. 28న భారత్, పాకిస్థాన్ జట్లు ఢీ కొట్టనున్నాయి. ఈ మ్యాచ్‌కు సంబంధించిన టికెట్ల అమ్మకాన్ని సోమవారం (ఆగస్ట్‌ 15) ఆరంబించగా.. నిమిషాల వ్యవధిలోనే హాట్‌కేకుల్లా అమ్ముడుపోయాయి. కేవలం ఆరున్నర నిమిషాల్లోనే మొత్తం టిక్కెట్లు అమ్ముడయ్యాయి. 

భారత్, పాకిస్థాన్ మ్యాచుకు సంబంధించిన టికెట్లను ఆగస్ట్‌ 15న రాత్రి 7:30 గంటలకు ప్లాటినంలిస్ట్‌ (Platinumlist) అనే వెబ్‌సైట్‌లో ఆరంభించారు. అదే సమయంలో ఒకేసారి 7.5 లక్షల మంది అభిమానులు సైట్‌పై దండయాత్ర చేశారు. దాంతో కాసేపు సైట్‌ క్రాష్ అయింది. అనంతరం సెట్ అయిన నిమిషాల్లోనే టిక్కెట్లు మొత్తం అమ్ముడయ్యాయి. టిక్కెట్లు దొరకని వారు నిరాశ వ్యక్తం చేశారు. అయితే టికెట్ల అమ్మకాల్లో పెద్ద ఎత్తున అవకతవకలు జరగాయని ఫాన్స్ ఆరోపిస్తున్నారు.

భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య నెలకొన్న సరిహద్దుల ఉద్రిక్తతల నేపథ్యంలో.. ఇరు దేశాల మధ్య గత కొన్నేళ్లుగా ద్వైపాక్షిక సిరీస్‌లు జరగడం లేదు. కేవలం ఐసీసీ టోర్నీల్లో మాత్రమే భారత్-పాక్ తలపడుతున్నాయి. అందుకే దాయాదుల మధ్య పోరు ఎప్పుడూ ఆసక్తికరంగా ఉంటుంది. భారత్, పాకిస్తాన్ జట్లు సూపర్‌-4 దశకు చేరితే.. మరోసారి తలపడే అవకాశం ఉంది. ఇక ఫైనల్‌కు చేరితే దాయాది జట్లు మళ్లీ పోటీపడనున్నాయి. ఇదే జరిగితే అభిమానులకు పండగే అని చెప్పొచ్చు. 

Also Read: Bipasha Basu Pregnancy: తల్లికాబోతున్న స్టార్ హీరోయిన్.. బేబీ బంప్‌ ఫొటో వైరల్!

Also Read: Jammu Kashmir Accident: జమ్ముకశ్మీర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు జవాన్లు మృతి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News