Vivo Flying Camera Phone: ఫ్లయింగ్ డ్రోన్ కెమెరా స్మార్ట్ ఫోన్... సరికొత్త ట్రెండ్ సెట్ చేయనున్న వివో.. ఈ అద్భుత స్మార్ట్ ఫోన్ ఫీచర్స్ ఇవే..

Vivo Flying Camera Smartphone: ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వివో నుంచి త్వరలోనే ఫ్లయింగ్ డ్రోన్ కెమెరా ఫోన్ లాంచ్ కానుంది. స్మార్ట్ ఫోన్లలో ఇది కచ్చితంగా కొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తుందనే వాదన ఉంది.

Written by - Srinivas Mittapalli | Last Updated : Aug 19, 2022, 10:40 AM IST
  • వివో నుంచి సరికొత్త స్మార్ట్ ఫోన్
  • ఫ్లయింగ్ డ్రోన్ కెమెరాతో కూడిన స్మార్ట్ ఫోన్
  • ఈ స్మార్ట్ ఫోన్ పూర్తి ఫీచర్స్ ఇక్కడ తెలుసుకోండి
Vivo Flying Camera Phone: ఫ్లయింగ్ డ్రోన్ కెమెరా స్మార్ట్ ఫోన్... సరికొత్త ట్రెండ్ సెట్ చేయనున్న వివో.. ఈ అద్భుత స్మార్ట్ ఫోన్ ఫీచర్స్ ఇవే..

Vivo Flying Camera Smartphone: ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వివో నుంచి త్వరలోనే ఫ్లయింగ్ డ్రోన్ కెమెరా ఫోన్ లాంచ్ కానుంది. స్మార్ట్ ఫోన్లలో ఇది కచ్చితంగా కొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తుందనే వాదన ఉంది. ఈ స్మార్ట్ ఫోన్‌కి ఉండే ఫ్లయింగ్ డ్రోన్ కెమెరాతో యూజర్స్ అద్భుతమైన ఫోటోలు, వీడియోలు తీయొచ్చు. ఈ ఫ్లయింగ్ డ్రోన్ కెమెరా.. ఫోన్‌ నుంచి విడివడి గాల్లోకి ఎగురుతూ ఫోటోలు షూట్ చేయగలదు. దీనికి సంబంధించిన పేటెంట్ కోసం వివో ఇప్పటికే వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆఫీస్ (WIPO)లో దరఖాస్తు చేసుకుంది. లాంచింగ్ డేట్ ఇంకా ఖరారు కాని ఈ స్మార్ట్ ఫోన్ కోసం చాలామంది కస్టమర్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ స్మార్ట్ ఫోన్‌ ఫీచర్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం...

వివో ఫ్లయింగ్ డ్రోన్ కెమెరా ఫోన్ ఫీచర్స్ :

ఈ స్మార్ట్ ఫోన్‌కి ఉండే డ్రోన్ కెమెరా 200 మెగా పిక్సెల్ రిజల్యూషన్‌తో ఉంటుంది. ఇప్పటివరకూ చాలా కంపెనీలు 200 మెగా పిక్సెల్ రిజల్యూషన్‌తో ఫోన్లను తీసుకొస్తున్నట్లు ప్రకటించాయి. కానీ వివో మాత్రమే ఆ దిశగా ముందంజలో ఉంది.
ఈ స్మార్ట్ ఫోన్‌‌కి కార్నిగ్ గొరిల్లా గ్లాస్ 7 ప్రొటెక్షన్ ఉంటుంది.
6.9 అంగుళాల సూపర్ అమోల్డ్ ఫుల్ టచ్ స్క్రీన్ డిస్‌ప్లే కలిగి ఉంటుంది.
ఈ స్మార్ట్ ఫోన్ రిజల్యూషన్ 1440 x 3200 పిక్సెల్స్.
32 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ లెన్స్, 16 మెగా పిక్సెల్ వైడ్ సెన్సార్, 5 మెగా పిక్సెల్ డెప్త్ సెన్సార్, 64 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా సెటప్ ఇందులో ఉంటుంది.
6900mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 36 గంటల వరకు వర్క్ చేస్తుంది.
65W క్విక్ బ్యాటరీ ఛార్జింగ్ కెపాసిటీ ఉంటుంది.
256 జీబీ, 512 జీబీ స్టోరేజీ 12 జీబీ ర్యామ్ ఉండొచ్చు.
క్వాల్‌కమ్ స్నాప్‌డ్రాగన్ 898 5జీ ప్రాసెసర్‌ను కలిగి ఉంటుంది.

ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్స్‌ :

ఈ స్మార్ట్ ఫోన్‌కి ఉండే ఫ్లయింగ్ కెమెరాలో ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్ కూడా ఉంటుంది. దీని సాయంతో కెమెరా గాల్లో ఎగురుతున్నప్పుడు ఇతర వస్తువులను ఢీకొట్టకుండా తగినంత ఎత్తులో ఎగురుతుంది. ఈ స్మార్ట్ ఫోన్ వచ్చే ఏడాది అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.

Also Read: LIGER Pre Release Event: లైగర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అక్కడే.. ఎప్పుడంటే?

Also Read: Shikhar Dhawan: శిఖర్ ధావన్‌ అరుదైన ఘనత.. సచిన్, ధోనీ, కోహ్లీ సరసన!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News