Liger movie rejected by three Pan India Star Heroes: ఇస్మార్ట్ శంకర్ లాంటి సూపర్ హిట్ తరువాత విజయ్ దేవరకొండతో కలిసి పూరి జగన్నాథ్ లైగర్ అనే సినిమా చేశారు. ఈ సినిమాలో అనన్య పాండే హీరోయిన్ గా నటించింది. భారీ అంచనాలతో ఈ సినిమా ఆగస్టు 25వ తేదీన తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదలైంది. సినిమాకి మొదటి అటు నుంచి కూడా మిక్స్డ్ రివ్యూస్ వస్తున్నాయి. అయితే ఎక్కువగా నెగిటివ్ టాక్ కనిపిస్తోంది.
ఈ నేపథ్యంలో ఈ సినిమా కథ విని రిజెక్ట్ చేసిన హీరోలు ఎవరు అనే విషయం మీద ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. అయితే ఈ విషయాన్ని హీరోలు గానీ పూరి జగన్నాథ్ కానీ వెల్లడించలేదు కానీ ఈ సినిమాని ముగ్గురు పాన్ ఇండియా హీరోలు కథ విన్న తర్వాత సినిమా చేయలేమని చెప్పారట. వారు మరెవరో కాదు జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, ప్రభాస్. ఈ ముగ్గురితో కూడా పూరి జగన్నాథ్ గతంలో సినిమాలు చేశారు. అల్లు అర్జున్ తో దేశముదురు, ఇద్దరమ్మాయిలతో వంటి సినిమాలు చేసిన పూరి జగన్నాథ్ ఆ పరిచయంతో లైగర్ కథ చెప్పారని సమాచారం.
అయితే పుష్ప సినిమా కోసం బల్క్ డేట్స్ ఇచ్చిన తాను ప్రస్తుతం లైగర్ కోసం మళ్ళీ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ చేయడం కష్టమని తాను చేయలేనని అల్లు అర్జున్ సున్నితంగా తిరస్కరించారట. ఎన్టీఆర్ విషయంలో కూడా ఇదే జరిగిందని అంటున్నారు. వీరిద్దరూ కలిసి గతంలో టెంపర్,ఆంధ్రావాలా వంటి సినిమాలు చేశారు. ఇక ఆర్ఆర్ఆర్ విషయంలో తాను లాక్ అయిపోయానని అందులో నుంచి ఎప్పుడు బయటకు వస్తానో తెలియదు కాబట్టి తనకోసం చూసుకోకుండా వేరే హీరోతో సినిమా ప్లాన్ చేసుకోమని సలహా ఇచ్చారట ఎన్టీఆర్.
తర్వాత ఈ కథ ప్రభాస్ వద్దకు కూడా వెళ్ళింది. ప్రభాస్ తో పూరీ జగన్నాధ్ బుజ్గాడు అనే సినిమా చేశారు. కానీ ఆయన కూడా ఇప్పటికే దాదాపు చాలా సినిమాలకు డేట్స్ ఇచ్చేసాను కాబట్టి తనతో ఇప్పట్లో సినిమా చేయడం కష్టమని చెప్పేయడంతో విజయ్ దేవరకొండ వరకు ఈ కథ వెళ్ళిందని అంటున్నారు. పూరీ జగన్నాథ్ మీద నమ్మకంతో విజయ్ దేవరకొండ సినిమా ఒప్పుకున్నాడని అయితే తన కథతో రొటీన్ స్టోరీ అయినా సరే మ్యాజిక్ చేసే పూరీ జగన్నాథ్ ఈ సినిమా విషయంలో మాత్రం ఇబ్బంది పడినట్లే కనిపిస్తోందని టాక్ వినిపిస్తోంది.
Also Read: Liger Trolls: “ఇండియాని షేక్ చేయాలె”.. అప్పుడు చెప్తే విన్నాడా ఈ పెద్ద మనిషి! ఆడుకుంటున్న నెటిజన్లు?
Also Read: Conspiracy on Vijay Devarakonda: 'లైగర్'-విజయ్ దేవరకొండపై కుట్ర.. కావాలనే నెగటివ్ టాక్.. వారి పనేనా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి