Prakash Raj: నమీబియా చీతాలు ఓకే.. బ్యాంకు ఛీటర్స్ చీతాలను ఎప్పుడు తీసుకొస్తారు.. మోడీని నిలదీసిన ప్రకాశ్ రాజ్

Prakash Raj : కొంత కాలంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని, ప్రధానమంత్రి నరేంద్ర మోడీని టార్గెట్ చేస్తున్నారు టాప్ హీరో ప్రకాశ్ రాజ్.  ఏ చిన్న అవకాశం వచ్చినా సోషల్ మీడియా వేదిక ద్వారా మోడీని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు

Written by - Srisailam | Last Updated : Sep 18, 2022, 10:52 AM IST
Prakash Raj: నమీబియా చీతాలు ఓకే.. బ్యాంకు ఛీటర్స్ చీతాలను ఎప్పుడు తీసుకొస్తారు.. మోడీని నిలదీసిన ప్రకాశ్ రాజ్

Prakash Raj : కొంత కాలంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని, ప్రధానమంత్రి నరేంద్ర మోడీని టార్గెట్ చేస్తున్నారు టాప్ హీరో ప్రకాశ్ రాజ్.  ఏ చిన్న అవకాశం వచ్చినా సోషల్ మీడియా వేదిక ద్వారా మోడీని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. బహిరంగ వేదికల్లోనూ బీజేపీ విధానాలను ఎండగడుతున్నారు. తాజాగా మరోసారి ప్రధాని మోడీని టార్గెట్ చేస్తూ ప్రశ్నలు సంధించారు ప్రకాశ్ రాజ్. ఆయన చేసిన ట్వీట్ పై నెటిజన్లు భారీగా స్పందిస్తున్నారు. తనదైన శైలలో కామెంట్లు పెడుతున్నారు.

ప్రధాని మోడీ శనివారం పుట్టినరోజు జరుపుతున్నారు. మోడీ జన్మదినం సందర్భంగా దేశ వ్యాప్తంగా పలు కార్యక్రమాలు జరిగాయి. కమలం కార్యకర్తలు మోడీ బర్త్ డేను ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు ప్రధానమంత్రి జన్మదినం సందర్భంగా  కేంద్రం వన్యప్రాణ సంరక్షణకు తెరతీసింది. దేశంలో అంతరించిపోయిన 8 చీతాలను నమీబియా నుంచి తీసుకొచ్చింది. దాదాపు 8 దశాబ్దాల తర్వాత చీతాలు ఇండియాలోకి అడుగుపెట్టాయి. నమీబియా నుంచి ప్రత్యేక విమానంలో తీసుకొచ్చిన చీతాలను మధ్యప్రదేశ్ లోని  కూనో పార్కులో స్వయంగా విడిచిపెట్టారు ప్రధాని మోడీ. దీనిపైనే ప్రకాశ్ రాజ్ ట్వీట్ చేశారు. ప్రధాని నరేంద్ర మోడీపై సెటైర్లు వేశారు.

'' అడవుల్లో తిరిగే చీతాలను రప్పించారు. మరి బ్యాంకులను మోసం చేసి పారిపోయిన ఈ చీతాలను ఎప్పుడు తీసుకొస్తారు. జస్ట్ అడుగుతున్నా '' అంటూ  ట్వీట్ చేశారు ప్రకాష్ రాజ్. విజయ్ మాల్వా, నీరవ్ మోదీ, మెహుల్ ఛోక్సీల ఫొటోలను ఆయన షేర్ చేశాడు.

Also Read: Chandigarh University: 60 మంది విద్యార్థుల బాత్ రూం వీడియోలు లీక్.. పంజాబ్ యూనివర్శిటీలో దారుణం

Also Read: NIA Raids: తెలుగు రాష్ట్రాల్లో ఎన్‌ఐఏ వేట..ఉగ్ర మూలాలపై ఏకకాలంలో సోదాలు..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebok

 

Trending News