Kriti Sanon and Prabhas dating: పెదనాన్న చనిపోయిన బాధలో ప్రభాస్.. కృతితో ప్రేమాయణమంటున్న బాలీవుడ్ మీడియా!

Kriti Sanon and Prabhas dating Rumors arised in Bollywood Media:  రెబల్ స్టార్ కృష్ణంరాజు మరణాన్ని గురించి ఇంకా తెలుగు ప్రేక్షకులు మరిచిపోక ముందే బాలీవుడ్ మీడియాలో ప్రభాస్ ప్రేమాయణం అంటూ వార్తలు పుట్టుకురావడం హాట్ టాపిక్ గా మారింది.

Written by - Chaganti Bhargav | Last Updated : Sep 18, 2022, 12:46 PM IST
Kriti Sanon and Prabhas dating: పెదనాన్న చనిపోయిన బాధలో ప్రభాస్.. కృతితో ప్రేమాయణమంటున్న బాలీవుడ్ మీడియా!

Kriti Sanon and Prabhas dating Rumors arised in Bollywood Media: తెలుగు సినీ పరిశ్రమ మొత్తం ఒక్కసారిగా తీవ్ర విషాదంలో కూరుకుపోయిన సంగతి తెలిసిందే. కొద్ది రోజుల క్రితం రెబల్ స్టార్ కృష్ణంరాజు అనారోగ్య కారణాలతో కన్నుమూశారు. ఆయన మరణాన్ని గురించి ఇంకా తెలుగు ప్రేక్షకులు మరిచిపోక ముందే బాలీవుడ్ మీడియాలో ప్రభాస్ ప్రేమాయణం అంటూ వార్తలు పుట్టుకురావడం హాట్ టాపిక్ గా మారింది.

నిజానికి ప్రభాస్ గతంలో అనుష్కతో ప్రేమలో ఉన్నాడని, వారిద్దరు వివాహం చేసుకోబోతున్నారని, వివాహం చేసుకున్నారని లేదు సహజీవనం చేస్తున్నారని ఇలా రకరకాల ప్రచారాలు జరిగాయి. అయితే ఇప్పుడు అనూహ్యంగా అనుష్కను పక్కనపెట్టి బాలీవుడ్ మీడియా ప్రభాస్ కృతి సనన్ మధ్య ప్రేమ పుట్టిందని, వారిద్దరు త్వరలో పెళ్లి పీటలు కూడా ఎక్కే అవకాశం ఉందని ప్రచారం చేస్తున్నారు. అసలు విషయం ఏమిటంటే ఆది పురుష్ సినిమాలో ప్రభాస్ రాఘవ అనే పాత్రలో నటిస్తుండగా అదే సినిమాలో సీత పాత్రలో కృతి సనన్ నటిస్తోంది.

రామాయణ ఇతిహాసాన్ని ఆధారంగా చేసుకుని ఈ సినిమా తెరకెక్కిస్తున్నట్లు అధికారిక ప్రకటన సినిమా యూనిట్ నుంచి ముందే వెలువడింది. ఈ సినిమా షూటింగ్ సమయంలో ప్రభాస్ కృతి సనన్ మధ్య పరిచయం ఏర్పడిందని ఆ పరిచయం ప్రేమగా మారిందని ప్రచారం జరుగుతోంది. అయితే ఇలా ప్రభాస్ పెదనాన్న చనిపోయి రోజులు కూడా గడవకముందే ఆయన గురించి ప్రేమలో ఉన్నాడని డేటింగ్ చేస్తున్నాడని ఇలా రకరకాల ప్రచారాలు చేయడం కరెక్ట్ కాదని తెలుగు అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

ప్రభాస్ ఫ్యాన్ ఇండియా లెవెల్ కి వెళ్ళాడు అక్కడ సినిమాలు చేస్తున్నాడని ఆనందపడాలో లేక అక్కడి మీడియా దృష్టిలో పడి అనవసరమైన పుకార్లతో బద్నాం అవుతున్నాడో అర్థం కావడం లేదని ప్రభాస్ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిజానికి ప్రభాస్ కి తన పెదనాన్న కృష్ణంరాజు అంటే చాలా ప్రేమ. ఈ విషయాన్ని అనేక సందర్భాల్లో ప్రభాస్ బయట పెట్టారు. అలాంటి కృష్ణంరాజు చనిపోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న ప్రభాస్ కి ఇలా అఫైర్లు అంటగట్టి ఆయనను బాలీవుడ్ మీడియా బద్నాం చేయడం ఏమీ బాలేదని ప్రభాస్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

దేనికైనా సమయం సందర్భం ఉంటుందని వారు మండిపడుతున్నారు. అయితే మరో వర్గం వారేమో ఆది పురుష్ ప్రమోషన్స్ లో భాగంగా బాలీవుడ్ మీడియా ఇలా చేసి ఉండవచ్చు అని అంటున్నారు. కానీ ఏదేమైనా ఇలా పెదనాన్న చనిపోయి బాధలో ఉన్న ప్రభాస్ ప్రేమాయణం అంటూ వార్తలు రావడం కాస్త ఇబ్బందికరమైన అంశమే అని చెప్పవచ్చు.

Also Read: Nani New Movie: మరో కొత్త దర్శకుడికి నాని గ్రీన్ సిగ్నల్.. అలాంటి ఎగ్జయిట్మెంట్ తోనే!

Also Read: God Father Movie: అసలు గాడ్ ఫాదర్ రిలీజవుతుందా? ఎందుకీ మౌనం?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News