Here is Jr NTR Rishab Shetty common connection: కన్నడ సినీ పరిశ్రమ నుంచి వస్తున్న సినిమాలన్నీ ఇప్పుడు దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నాయి. ముందుగా కేజిఎఫ్, కేజిఎఫ్ 2 సినిమాలు సూపర్ హిట్లుగా నిలవగా ఆ తర్వాత వచ్చిన గరుడ గమన వృషభ వాహన సినిమా కూడా సూపర్ హిట్ గా నిలిచింది. ఇక ఆ తర్వాత వచ్చిన 777 చార్లీ సినిమా కూడా మంచి హిట్ సాధించింది. ఇక రిషబ్ శెట్టి హీరోగా, దర్శకుడిగా వ్యవహరించిన కాంతార సినిమా కూడా కేవలం కన్నడ నాట మాత్రమే కాక విడుదలైన అన్ని భాషల్లోనూ మంచి పేరు తెచ్చుకుంటుంది.
ఈ రోజు తెలుగులో విడుదలైన ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ అయితే దక్కింది. ఇక ఈ సినిమాకు హీరో గానే కాకుండా రైటర్ డైరెక్టర్ గా కూడా వ్యవహరించారు రిషబ్ శెట్టి. అయితే రిషబ్ శెట్టి తాజాగా ప్రమోషన్స్ లో పాల్గొంటూ ఎన్టీఆర్ కూడా మా వాడే అంటూ కామెంట్ చేయడం ఆసక్తికరంగా మారింది. అసలు రిషబ్ శెట్టికి ఎన్టీఆర్ కి ఎక్కడ సంబంధం ఉందా అని అనుకుంటున్నారా ఉండండి అదేమిటంటే ఎన్టీఆర్ తల్లి షాలిని కర్ణాటక కు చెందిన వారన్న సంగతి తెలిసిందే.
మంగుళూరు నుంచి ఉడిపి మీదుగా భత్కళ్ వెళ్లేదారిలో కుందపుర అనే ఒక చిన్న పట్టణంలో శాలిని పుట్టి పెరిగారు. తర్వాత చిన్న వయసులోనే హైదరాబాద్ వచ్చి సెటిల్ అయ్యారు. తర్వాత నందమూరి హరికృష్ణ వివాహం చేసుకోవడం లాంటి విషయాలన్నీ తెలిసినవే. అదే ఊరికి చెందిన రిషబ్ శెట్టి కూడా ఇప్పుడు హీరోగా మారి సంచలన హిట్లు కొడుతున్నారు. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తన అభిమాన హీరో ఎవరు అని ప్రశ్నించినప్పుడు, రిషబ్ పింక్‌విల్లాతో మాట్లాడుతూ “మహేష్ బాబు, ప్రభాస్, అల్లు అర్జున్ వంటి చాలా మంది సూపర్ స్టార్లు ఉన్నారు.
కానీ నాకు జూనియర్ ఎన్టీఆర్ అంటే ఇష్టం అని అన్నారు. ఆయన లానే మీరూ నవ్వుతున్నారని ఎవరైనా చెప్పారా? అని అడిగితే లేదని అంటూనే అతనితో ఉన్న మరొక అనుబంధం అంటూ ఆసక్తికరమైన విషయం బయటపెట్టారు. ఎన్ఠీఆర్ తల్లిది, మాది ఒకే గ్రామం అని అన్నారు. ఇక ఆయనని ఎప్పుడైనా డైరక్ట్ చేస్తారా? అని అడిగితే దాని గురించి ఎప్పుడూ ఆలోచించలేదని, అలాంటి కథ, కాన్సెప్ట్ వచ్చినప్పుడే అది డిసైడ్ చేసుకోగలనన్నారు.
Also Read: Kantara Telugu Movie Review : కాంతారా మూవీ రివ్యూ.. నటనలో శభాష్ అనిపించే రిషబ్.. మెంటలెక్కించే క్లైమాక్స్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook