Cyclone Sitrang Updates: సర్వత్రా ఆందోళన కలిగిస్తోన్న సిత్రాంగ్ తుఫాన్ ముప్పుపై వాతావరణశాఖ క్లారిటీ ఇచ్చింది. ఉత్తర అండమాన్ సముద్రం, దక్షిణ అండమాన్ సముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతం పరిసర ప్రాంతాలపై అల్పపీడన ఏర్పడే అవకాశాల నేపథ్యంలో ఏపీకి తుఫాన్ ముప్పు దాదాపు లేనట్లేనని అధికారులు చెబుతున్నారు. ఈ తుఫాన్ ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ వైపు కదిలే అవకాశం ఉందని చెబుతున్నారు. పశ్చిమ-వాయువ్యంగా పయనించి అక్టోబర్ 22 నాటికి ఆగ్నేయ బంగాళాఖాతం మీదుగా అల్పపీడనంగా మారే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. తదుపరి 48 గంటల్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుఫానుగా మారే అవకాశం ఉందంటున్నారు.
సిత్రాంగ్ తుఫాన్ ప్రభావంతో కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో రోజులపాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో చేపల వేట కోసం జాలర్లు సముద్రంలోకి వెళ్లొద్దని అధికారులు ఆదేశించారు. విపత్తు నిర్వహణ యంత్రాంగం కూడా అప్రమత్తంగా ఉంది.
సిత్రాంగ్ తుఫాన్ తీరం ఎక్కడ దాటనుందో స్పష్టత లేనందున ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు భరోసా ఇస్తున్నారు. అల్పపీడనం ప్రాంతం స్పష్టంగా తెలియడం లేదని.. తుఫాన్ ప్రభావం, తీరం దాటే ప్రాంతం వివరాలను ధ్రువీకరించడం సాధ్యపడడం లేదన్నారు. తుఫాన్ కదలికపై అనుక్షణం అప్రమత్తంగా ఉన్నామని చెబుతున్నారు.
పశ్చిమ బెంగాల్ తీరంలో సముద్ర ఉష్ణోగ్రతల ఎక్కువగా ఉండడంతో.. అటు వైపు కదిలే అవకాశాలు ఉన్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. వాతావరణంలో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటే తప్పా దాదాపు ఆంధ్రప్రదేశ్‌కు తుఫాన్ ముప్పు లేనట్లేనని అంటున్నారు. మరోవైపు ఏపీలో ఇప్పటికే అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి.
Also Read: మరో 5 రోజుల్లో సూర్యగ్రహణం.. హైదరాబాద్ లో ఎన్ని నిమిషాలు కనిపిస్తుందో తెలుసా?
As per IMD forecast of 20th Oct 2022 at 08:00 AM;
Under the influence of the cyclonic circulation over north Andaman Sea and neighbourhood, a Low Pressure Area has formed over north Andaman Sea and adjoining areas of south Andaman Sea & Southeast Bay of Bengal. (1/2)
— Andhra Pradesh State Disaster Management Authority (@APSDMA) October 20, 2022
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook