రూ.5మేర తగ్గనున్న పెట్రోల్, డీజిల్ ధరలు?

వాహనదారులకు చుక్కలు చూపిస్తున్న పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది.

Last Updated : May 31, 2018, 12:26 PM IST
రూ.5మేర తగ్గనున్న పెట్రోల్, డీజిల్ ధరలు?

వాహనదారులకు చుక్కలు చూపిస్తున్న పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. ఈ మేరకు ఇంధనంపై ప్రభుత్వ ఎక్సైజ్ డ్యూటీని తగ్గించే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఇదే గనక నిజమైతే త్వరలోనే పెట్రోల్, డీజిల్ ధరలు రూ.4 నుంచి రూ.5 వరకు దిగిరానున్నాయట. కాగా రేట్ల తగ్గింపులో రాష్ట్రాలు, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు సహకరిస్తేనే ఇది సాధ్యమవుతుందట.

ఓ ఉన్నతాధికారి ఇచ్చిన సమాచారం మేరకు.. ఇంధన ధరలు పెరగడంపై కేంద్రం తీవ్ర ఆందోళనలో ఉందని, త్వరలోనే ఎక్సైజ్‌ డ్యూటీ తగ్గింపు ఉంటుందని తెలిసింది. కానీ రేట్ల తగ్గింపులో రాష్ట్రాలు, ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు ప్రముఖ పాత్ర  పోషించాలని అన్నారు.

అటు కేరళలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఒక్క రూపాయి తగ్గాయి. ఇంధనంపై విక్రయ పన్నును తగ్గించి పెట్రోల్‌, డీజిల్‌ ధరలను రూపాయి మేర తగ్గిస్తున్నట్టు కేరళ ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిర్ణయం జూన్‌ 1 నుంచి అమల్లోకి వస్తుందని తెలిపింది.

నేడు(గురువారం) దేశీయంగా లీటరు పెట్రోల్‌పై 7 పైసలు, లీటరు డీజిల్‌పై 5 పైసలు ధర తగ్గింది. దీంతో ఢిల్లీలో లీటరు పెట్రోల్‌ ధర రూ.78.35గా, డీజిల్ ధర రూ. రూ.69.25గా నమోదైంది.

Trending News