Navada Family Ends Life: బీహార్‌లోని నవాడాలో హృదయ విదారక ఘటన వెలుగు చూసింది. నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఓ కుటుంబం అప్పులపాలై ఆరుగురు విషం కలుపుకుని తాగారు. వీరిలో ఐదుగురు మృతి చెందగా.. 15 ఏళ్ల బాలిక చికిత్స పొందుతోంది. ఈ సంఘటన బుధవారం రాత్రి జరిగింది. పోలీసులకు దొరికిన మొబైల్‌లో అప్పు ఇచ్చిన వ్యక్తి పేరు ఉంది. ఆత్మహత్యకు సంబంధించి ఓ పేపర్‌లో నోట్ రాసి మొబైల్‌లో పెట్టారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. వివరాలు ఇలా..
కేదార్‌లాల్ గుప్తా అనే వ్యక్తి నగరంలోని విజయ్ బజార్‌లో పండ్ల దుకాణం నిర్వహిస్తున్నాడు. అతనికి భార్య అనితా కుమారి, నలుగురు పిల్లలు ఉన్నారు. కుటుంబ పోషణకు కొందరి వద్ద అప్పులు చేశాడు. తిరిగి చెల్లించేందుకు తీవ్ర ఇబ్బంది పడుతున్నాడు. ఈ నేపథ్యంలోనే అప్పుల ఇచ్చిన వారి నుంచి ఒత్తిడి ఎక్కువైంది. వేధింపులు భరించలేక కేదార్ లాల్ గుప్తాతోపాటు కుటుంబ సభ్యులంతా నగరంలోని ఓ శ్మశానవాటిక వద్దకు వెళ్లి విషం తాగారు. ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా.. చికిత్స పొందుతూ ముగ్గురు మృతి చెందారు.
మరణించిన వారిలో కేదార్ లాల్ గుప్తా (50), భార్య అనితా దేవి (48), కుమార్తెలు షబ్నం కుమారి (20), గుడియా కుమారి (17), కుమారుడు ప్రిన్స్ కుమార్ (16) ఉన్నారు. మరో కుమార్తె సాక్షి కుమారి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. విషయం తెలుసుకున్న నవాడా ఎస్పీ గౌరవ్ మంగ్లా సదర్ ఆసుపత్రికి చేరుకున్నారు. బాధితురాలు సాక్షి కుమారితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ప్రాథమికంగా అందుతున్న సమాచారం ప్రకారం అప్పుల బాధతో కుటుంబమంతా ఇబ్బంది పడిందని తెలిపారు. ఆత్మహత్యకు సంబంధించి ప్రస్తుతం విచారణ కొనసాగుతోందని చెప్పారు.
Also Read: IND vs ENG: భారత్ హిస్టరీ చూసి భయపడుతున్న పాకిస్తాన్ ఫ్యాన్స్.. ఇంగ్లండ్ గెలవాలంటూ ప్రార్థనలు!
Also Read: Thummala Nageswara Rao: టీఆర్‌ఎస్ పార్టీకి బిగ్ షాక్.. తుమ్మల నాగేశ్వరరావు జంప్..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook