ఫోర్బ్స్‌ జాబితాలో విరాట్ ఏకైక ఆటగాడు

ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ఆదాయం పొందుతున్న టాప్‌-100 ఆటగాళ్ల జాబితాను ఫోర్బ్స్‌ జాబితాను విడుదల చేయగా.. అందులో టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీ చోటు దక్కించుకున్నారు.

Last Updated : Jun 6, 2018, 11:19 AM IST
ఫోర్బ్స్‌ జాబితాలో విరాట్ ఏకైక ఆటగాడు

ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ఆదాయం పొందుతున్న టాప్‌-100 ఆటగాళ్ల జాబితాను ఫోర్బ్స్‌ జాబితాను విడుదల చేయగా.. అందులో టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీ చోటు దక్కించుకున్నారు. 22 దేశాలకు చెందిన ఆటగాళ్లు టాప్‌-100లో నిలిచారు. అత్యధికంగా అమెరికా నుంచి 66 మంది ఆటగాళ్లు ఉన్నారు. గత ఏడాది జూన్‌ 1 నుంచి ఈ ఏడాది జూన్‌ 1 మధ్య ఆటగాళ్లు పొందిన ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకొని ఫోర్బ్స్‌ ఈ జాబితాను వెల్లడించింది.

కాగా భారత్‌ నుంచి ఈ ఫోర్బ్స్‌ జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక ఆటగాడు కోహ్లీ కావడం విశేషం. 24 మిలియన్ల డాలర్ల ఆదాయంతో కోహ్లీ 83వ స్థానంలో నిలిచాడు. 4 మిలియన్ల డాలర్లను వేతనంగా అందుకుంటున్న కోహ్లీ మిగతా 20 మిలియన్‌ డాలర్లను వాణిజ్య ఒప్పందాల ద్వారా సంపాదిస్తున్నాడు. గత ఏడాది 22 మిలియన్‌ డాలర్ల ఆదాయంతో కోహ్లీ 89వ స్థానంలో నిలిచాడు.

అమెరికాకు చెందిన బాక్సింగ్‌ దిగ్గజం ఫ్లాయడ్‌ మేవెదర్‌ (285 మిలియన్‌ డాలర్లు) అగ్రస్థానం, అర్జెంటీనా ఫుట్‌బాల్‌ ఆటగాడు మెస్సీ(111 మిలియన్‌ డాలర్లు), పోర్చుగల్‌ ఫుట్‌బాల్‌ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో (108 మిలియన్‌ డాలర్లు) రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. కాగా.. ఈ జాబితాలో ఒక్క మహిళ కూడా లేకపోవడం గమనార్హం.

Trending News