Allu Aravind Supports Dil Raju: దిల్ రాజుకు అల్లు అరవింద్ సపోర్ట్.. అసలు అది జరగదంటూ కామెంట్స్!

Allu Aravind Supports Dil Raju : వారసుడు సినిమాను దిల్ రాజు రిలీజ్ చేస్తున్న క్రమంలో ఒక వివాదం ఏర్పడిన సంగతి తెలిసిందే, అయితే ఇప్పుడు దిల్ రాజుకు సపోర్ట్ గా అల్లు అరవింద్ కామెంట్ చేయడం హాట్ టాపిక్ అవుతోంది. ఆ వివరాలు  

Written by - Chaganti Bhargav | Last Updated : Nov 19, 2022, 04:47 PM IST
Allu Aravind Supports Dil Raju: దిల్ రాజుకు అల్లు అరవింద్ సపోర్ట్.. అసలు అది జరగదంటూ కామెంట్స్!

Allu Aravind Supports Dil Raju Over Varasudu Release: గతంలో తాను చేసిన వ్యాఖ్యలకు భిన్నంగా దిల్ రాజు ఈసారి తమిళంలో రూపొందించిన వారిసు సినిమాను తెలుగులో విడుదల చేసేందుకు సిద్ధం రంగం సిద్ధం చేసుకుంటున్నారు. వాస్తవానికి ఆయన విజయ్ హీరోగా వారిసు సినిమాను తెలుగులో వారసుడు పేరుతో రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమాకు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించారు. రష్మిక మందన్న హీరోయిన్గా నటించిన ఈ సినిమా ప్రకటించిన సమయంలో బై లింగ్యువల్ సినిమా అన్నారు కానీ ఆ తర్వాత పలు కారణాలతో ఈ సినిమాని పూర్తి తమిళ సినిమా అంటున్నారు. దీనికి రెండు కారణాలు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.

ఒకటి తెలుగు సినిమా షూటింగ్స్ నిలిపి వేసినప్పుడు కూడా ఈ సినిమా షూటింగ్ జరిపారు దిల్ రాజు. దానికి వంకగా ఇది తమిళ సినిమా అని తెలుగు డబ్బింగ్ చేస్తున్నామని కవర్ చేసే ప్రయత్నం చేశారు. అది కూడా కాకుండా తమిళనాడులో డైరెక్ట్గా రిలీజ్ చేసే సినిమాలుకు తమిళనాడులో రిలీజ్ చేసే సమయంలో టాక్స్ కాస్త తక్కువ ఉంటుంది. అదే ఇతర భాషల్లో చేసిన సినిమాలు తమిళంలో విడుదల చేయాలంటే టాక్స్ రూపంలో ఎక్కువ మొత్తం చదివించాల్సి ఉంటుంది. దాన్ని సేవ్ చేసేందుకు అలాగే విజయ్ కు తమిళనాడు వ్యాప్తంగా ఉన్న క్రేఙ్ ని వాడుకునేందుకు దాని డైరెక్ట్ తమిళ మూవీ అని దిల్ రాజు ప్రమోట్ చేస్తూ వస్తున్నారు.

ఇప్పుడు అదే ఆయన తలకు పెద్ద తలనొప్పిగా మారింది. గతంలో దిల్ రాజు డైరెక్ట్ తెలుగు సినిమాలు ఉన్నప్పుడు ఇలా డబ్బింగ్ సినిమాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకూడదని ఒకటి రెండు సందర్భాలలో స్వయంగా పేర్కొన్నారు. కానీ ఇప్పుడు ఆయన స్వయంగా వారసుడు సినిమా తెలుగులో రిలీజ్ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్న సమయంలో దాన్ని ఖండిస్తూ తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఒక లేఖ విడుదల చేసింది. అలా లేఖ విడుదల చేయడం కరెక్ట్ కాదని తమిళ దర్శకులు ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.  ఇదే విధంగా ముందుకు వెళితే భవిష్యత్తులో తెలుగు సినిమాలను కూడా తమిళంలో నియంత్రిస్తామని వారు హెచ్చరికలు జారీ చేసినట్లు చెబుతున్నారు.

ఈ నెల 22వ తేదీన తమిళ సమావేశం కాబోతున్నారు ఈ సమావేశంలో ఒక కీలక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు ఆ సంగతి పక్కన పెడితే దిల్ రాజుకు సపోర్టుగా అల్లు అరవింద్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అల్లు అరవింద్ ఈ ఏడాది కాంతార అనే డబ్బింగ్ సినిమాతో మంచి హిట్ అందుకున్నారు. రెండు కోట్ల రూపాయలు కొనుగోలు విడుదల చేసిన ఈ సినిమా సుమారుగా 65 కోట్ల రూపాయల షేర్ వసూలు చేసింది. ఇప్పుడు అల్లు అరవింద్ మరో సినిమా కూడా విడుదల చేస్తున్నారు. హిందీలో భేడియా అనే సినిమాని ఆయన తెలుగులో తోడేలు పేరుతో రిలీజ్ చేస్తున్నారు.

ఈ సినిమాలో వరుణ్ ధావన్, కృతి సనన్ హీరో హీరోయిన్గా నటించారు. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఒక ప్రెస్ మీట్ హైదరాబాద్ లో జరిగింది. ఈ ప్రెస్ మీట్ లో భాగంగా అల్లు అరవింద్ ను ఇదే విషయం మీద ఒక జర్నలిస్ట్ ప్రశ్నించారు. మీరేమో ఇండియన్ సినిమా అని అన్ని భాషల సినిమాలను తెలుగులో రిలీజ్ చేస్తున్నారు, తెలుగు సినిమాను మిగతా భాషలలో రిలీజ్ చేస్తున్నారు కానీ ఇలా సంక్రాంతికి ఇతర భాషల సినిమాలను తెలుగులో రిలీజ్ చేయకూడదని తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఒక లేఖ విడుదల చేసింది కదా. దాని గురించి ఏమంటారు అంటే ఇది సాధ్యమయ్యే పనే కాదు అంటూ దిల్ రాజుకు పరోక్షంగా ఆయన మద్దతు ప్రకటించారు. ఇక ఈ విషయం మీద రకరకాలు చర్చలు అయితే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో జరుగుతున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. 

Also Read: Gaalodu Craze: మంచు విష్ణు జిన్నా క్లోజింగ్ కలెక్షన్స్ ను ఒక్కరోజులో చిత్తు చేసిన 'గాలోడు' సుడిగాలి సుధీర్

Also Read: Support to Dil Raju: దిల్ రాజుకు అండగా తమిళ నిర్మాతలు... 'వారసుడు'ను టచ్ చేస్తే, తెలుగు సినిమాలు ఆడనివ్వం?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News