Venus Rise 2022: 50 రోజుల తaర్వాత ఉదయించబోతున్న శుక్రుడు.. ఈ 3 రాశులవారిని వరించనున్న అదృష్టం

Venus Rise In Scorpio: వైదిక జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, శుక్ర గ్రహం వృశ్చిక రాశిలో ఉదయించబోతోంది. ఈ సంచారం వల్ల 3 రాశులవారు భారీగా లాభాలను పొందనున్నారు.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Nov 22, 2022, 04:04 PM IST
  • వృశ్చిక రాశిలో ఉదయించనున్న శుక్రుడు
  • ఈ 3 రాశులవారికి ప్రయోజనకరం
  • ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం.
Venus Rise 2022: 50 రోజుల తaర్వాత ఉదయించబోతున్న శుక్రుడు.. ఈ 3 రాశులవారిని వరించనున్న అదృష్టం

Venus Rise In Scorpio 2022: ఐశ్వర్యాన్ని ప్రసాదించే శుక్రుడు ఉదయించబోతున్నాడు. అక్టోబర్ 02న అస్తమించిన శుక్రుడు.. ఇవాళ అంటే నవంబరు 20 రాత్రి వృశ్చిక రాశిలో ఉదయించబోతున్నాడు. దీని ప్రభావం (Venus Rise In Scorpio 2022) అన్ని రాశులవారిపై కనిపిస్తుంది. దీంతో మూడు రాశులవారి అదృష్టం ప్రకాశించనుంది. మీరు వృత్తి, వ్యాపారాల్లో విజయం సాధిస్తారు. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం. 

వృశ్చికం (Scorpio): శుక్ర గ్రహం యొక్క ఉదయం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే శుక్ర గ్రహం మీ రాశిలో ఉదయించబోతోంది. మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. జీవిత భాగస్వామి నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది. పెళ్లికానీ యువతీయువకులకు వివాహం జరిగే అవకాశం ఉంది. మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంది.

మీనం (Pisces): శుక్రుని ఉదయించడం వృత్తి మరియు వ్యాపార పరంగా మీకు మంచిది. ఎందుకంటే శుక్ర గ్రహం మీ రాశి నుండి తొమ్మిదవ ఇంట్లో ఉండబోతోంది. శుక్రుడు ఉదయించిన వెంటనే మీ అదృష్టం ప్రకాశిస్తుంది. వ్యాపారం నిమిత్తం చేసే ప్రయాణాలు లాభిస్తాయి. విదేశాకు వెళ్లాలనుకునేవారి కోరిక నెరవేరుతుంది. బిజినెస్ లో మంచి లాభాలు ఉంటాయి. 

కుంభం (Aquarius): శుక్ర గ్రహం ఉదయించడం మీకు అనుకూలంగా ఉంటుంది. మీ వ్యాపారం విస్తరిస్తుంది. ఉద్యోగులకు కొత్త అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. పాత పెట్టుబడి నుండి ప్రయోజనం పొందుతారు. పెండింగ్ లో ఉన్న పనులు పూర్తవుతాయి. మీరు ఈ సమయంలో మణి రాయిని ధరించడం వల్ల మీ అదృష్టం ప్రకాశిస్తుంది. 

Also Read: Shani Gochar 2022: అరుదైన యోగాన్ని చేస్తున్న శనిదేవుడు... ఇక ఈ 3 రాశులకు డబ్బే డబ్బు.. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

 

 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News