Rohit Sharma Childhood Coach Dinesh Lad slams Indian Players: భారత్ ఐసీసీ ట్రోఫీ గెలిచి దాదాపు పదేళ్లు పూర్తయ్యాయి. చివరిసారిగా 2013లో మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ సారథ్యంలో టీమిండియా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచింది. అనంతరం జరిగిన 2015 వన్డే ప్రపంచకప్, 2019 వన్డే ప్రపంచకప్, 2021 టీ20 ప్రపంచకప్, 2021 టెస్ట్ ఛాంపియన్‌షిప్, 2022 టీ20 ప్రపంచకప్‌లలో భారత్ నిరాశపరిచింది. గత పదేళ్లుగా ఐసీసీ ట్రోఫీ భారత జట్టుకు అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. ముఖ్యంగా 2022 టీ20 ప్రపంచకప్‌లో నిరాశపరిచిన భారత జట్టుపై తీవ్ర విమర్శలు వచ్చాయి.
టీమిండియా ప్లేయర్స్ దేశం కంటే ఐపీఎల్ టోర్నీకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని, అందుకే 2022 టీ20 ప్రపంచకప్ ఫైనల్ చేరలేకపోయిందని మాజీ ఆటగాళ్లు ఆరోపణలు చేశారు. తాజాగా ఈ జాబితాలోకి టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చిన్ననాటి కోచ్ దినేష్ లాడ్ చేరారు. జట్టులో స్ధిరత్వం లేకపోవడమే టీ20 ప్రపంచకప్ 2022 నుంచి భారత్ ఇంటిముఖం పట్టిందని అభిప్రాయపడ్డారు. గత కొన్నాళ్లుగా భారత జట్టులో స్ధిరత్వం లేదన్నారు. భారత్ ప్రపంచకప్ గెలవాలంటే ఐపీఎల్ టోర్నీకి ప్లేయర్స్ దూరంగా ఉంటేనే సాధ్యమవుతుందని దినేష్ లాడ్ పేర్కొన్నారు.
స్పోర్ట్స్ కీడాతో రోహిత్ శర్మ చిన్ననాటి కోచ్ దినేష్ లాడ్ మాట్లాడుతూ... 'గత 7-8 నెలల్లో భారత జట్టులో స్ధిరత్వం లేదు. ప్రపంచకప్ లాంటి పెద్ద టోర్నీకి సిద్ధమైనప్పడు పటిష్ట జట్టును తయారు చేసుకోవాలి. ఇటీవలి రోజుల్లో భారత ఇన్నింగ్స్‌ను ఒక్కో మ్యాచ్ లేదా సిరీస్‌లో ఒక్కొక్కరు ప్రారంభించారు. బౌలింగ్ విభాగంలో కూడా ఎప్పటికప్పుడు బౌలర్లు మారుతూనే ఉన్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే.. పనిభారం పేరుతో ఆటగాళ్లకు విశ్రాంతి ఇస్తున్నామంటున్నారు. ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ ప్రొఫెషనల్స్. కాబట్టి పనిభారం అని చెప్పడం చాలా హాస్యంగా ఉంది' అని అన్నారు.
'ప్రపంచ క్రికెట్‌లో మిగితా ఆటగాళ్లకు లేని పనిభారం కేవలం టీమిండియా ఆటగాళ్లకు మాత్రమే ఉందా?. పనిభారం అని చెప్పిన వారు ఐపీఎల్‌లో ఎందుకు ఆడుతున్నారు?. ప్రపంచకప్ గెలవాలంటే ఐపీఎల్ ఆడకండి. అంతర్జాతీయ క్రికెట్‌లో ఎలాంటి రాజీ పడకూడదు. ప్రొఫెషనల్ క్రికెటర్లు ప్రతీ అంతర్జాతీయ మ్యాచ్‌కు అందుబాటులో ఉండాలి. ఐపీఎల్ కాంట్రాక్టులను వదులుకోవాలా వద్దా అనేది ఆటగాళ్ల ఇష్టం. అంతర్జాతీయ ప్రదర్శనను పరిగణలోకి తీసుకుని మాత్రమే ఐపీఎల్ కాంట్రాక్టు వస్తుంది అని గుర్తుంచుకోవాలి' అని దినేష్ లాడ్ పేర్కొన్నారు.
Also Read: IND vs NZ: భారత్ ఔట్ డేటేడ్ టీమ్.. మైఖేల్ వాన్ సంచలన వ్యాఖ్యలు!
Also Read: Umran Malik: ఉమ్రాన్‌కు అతిపెద్ద బలం అదే.. ప్రశంసలు కురిపించిన భారత మాజీ పేసర్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook.