I Love You Suma: సుమకు లైవ్లో ఐ లవ్యూ చెప్పిన కుర్రోడు... మాములుగా లేదుగా ఇది!

Youngster Says I Love You Suma : తాజాగా డిసెంబర్ మూడో తేదీ ప్రసారం కాబోతున్న క్యాష్ ప్రోగ్రామ్ కు సంబంధించిన ప్రోమో విడుదలవగా అందులో యాంకర్ సుమకు ఒక కుర్రాడు ప్రపోజ్ చేయడం హాట్ టాపిక్ అయింది. ఆ వివరాలు 

Written by - Chaganti Bhargav | Last Updated : Nov 29, 2022, 04:35 PM IST
I Love You Suma: సుమకు లైవ్లో ఐ లవ్యూ చెప్పిన కుర్రోడు... మాములుగా లేదుగా ఇది!

Youngster Says I Love You Suma in Cash Program: యాంకర్ సుమ గురించి తెలుగు ప్రేక్షకులందరికీ ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగు అమ్మాయి కాకపోయినా తెలుగువారితో మమేకమై తెలుగు ప్రోగ్రామ్స్ చేస్తూ తెలుగు సినీ ఫంక్షన్లకు యాంకరింగ్ చేస్తూ అందరికీ తలలో నాలుకలా మారింది. ఇక ఆమె చేస్తున్న క్యాష్ ప్రోగ్రామ్ కూడా సూపర్ హిట్ గా నిలుస్తూ ఉంటుంది. ఎప్పటికప్పుడు సినీ సెలబ్రిటీలు, సీరియల్స్ సెలబ్రిటీలను తీసుకొచ్చి వారితో ఆటలు ఆడించి అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉంటుంది.

తాజాగా డిసెంబర్ మూడో తేదీ ప్రసారం కాబోతున్న క్యాష్ ప్రోగ్రామ్ కు సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఈ క్యాష్ ప్రోగ్రాంలో ప్రభాస్ శ్రీను, కమెడియన్ ప్రవీణ్, నటి హరితేజ, నటి హేమ కనిపించబోతున్నట్లు ప్రోమో ద్వారా క్లారిటీ వచ్చింది. ఇక ఈ క్యాష్ ప్రోగ్రాంలో భాగంగా అనేక ఆటలు నిర్వహిస్తూ వచ్చిన సుమ తర్వాత క్యాష్ ఫిలిం స్కూల్ అనే ఒక ప్రోగ్రాం నిర్వహిస్తున్నట్లుగా ప్రోమోలో చూపించారు.

ఇంతలో కమెడియన్ ప్రవీణ్ ను పిలిచి ఈయన లవ్ గురించి ఒక ఫిలిం క్లాస్ తీసుకోబోతున్నారు అంటూ ప్రోగ్రాం చూడడానికి వచ్చిన స్టూడెంట్స్ లో ఒకరిని స్టేజి మీదకు పిలిచారు. సరే అండి పార్కులో ఒక అమ్మాయి వెయిట్ చేస్తోంది అంటూ సుమ తానే అమ్మాయిలా వెళ్లి అక్కడ నిలిచునేందుకు ప్రయత్నిస్తే ప్రవీణ్ అమ్మాయి అన్నారు ఆంటీ ఉందేంటి అని కౌంటర్ వెయ్యబోయాడు. దీంతో అందరూ పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకున్నారు.

దీంతో స్టూడెంట్ వైపు తిరిగి చూసిన ప్రవీణ్ అమ్మాయి అక్కడ ఆటో కోసం చూస్తోంది ఆటో వచ్చేలోపు ప్రపోజ్ చెయ్ వెళ్లి ఐ లవ్ యు చెప్పమని పంపిస్తాడు. వెంటనే ఆ కుర్రాడు అక్కడికి వెళ్లి మిమ్మల్ని ఎప్పటినుంచో ఫాలో అవుతున్నాను సుమ గారు మీరంటే నాకు చాలా ఇష్టం సుమ గారు ఐ లవ్ యు సుమ అని చెప్పడంతో వెంటనే షాక్ అవ్వకుండా నువ్వు మా అబ్బాయి క్లాస్మేట్ కదూ అంటూ కౌంటర్ వేసింది. దీంతో అందరూ నవ్వుకున్నారు. 

Also Read: Yashoda Movie: సమంత 'యశోద'కు లైన్ క్లియర్.. ఐదు కోట్ల దావా అందుకే!

Also Read: Nikhil 18 Pages : కొంచెం టైం ఇవ్వు.. నిఖిల్‌ను వేడుకున్న హీరో శింబు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

 
 

Trending News