Mohammed Shami Hand Injury: ప్రస్తుతం భారత జట్టు బంగ్లాదేశ్ పర్యటనలో ఉంది. ఆదివారం నుంచి బంగ్లాదేశ్‌తో టీమిండియా మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. తొలి వన్డే ప్రారంభానికి ఒకరోజు ముందు భారత్‌కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. భుజం గాయం కారణంగా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ బంగ్లాదేశ్‌తో జరిగే వన్డే సిరీస్‌కు పూర్తిగా దూరమైనట్లు బీసీసీఐ ధృవీకరించింది. వన్డే సిరీస్ కోసం షమీ స్థానంలో ఉమ్రాన్ మాలిక్‌ను జట్టులోకి తీసుకున్నారు.
బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్‌కు సన్నాహక సమయంలో షమీ ట్రైనింగ్ సెషన్‌లో భుజానికి గాయమైనట్లు బీసీసీ తెలిపింది. అతను ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో బీసీసీఐ వైద్య బృందం పరిశీలనలో ఉన్నాడు. తాజాగా తాను చికిత్స తీసుకుంటున్న ఫొటోలను షమీ షేర్ చేసుకున్నాడు. తన కెరీర్‌లో గాయాలు భాగమైపోయాయని.. గాయమైన ప్రతిసారి నేర్చుకుని మరింత బలంగా తిరిగి వచ్చానని అన్నాడు. బంగ్లాతో టెస్ట్ సిరీస్ ఆరంభానికి షమీ కోలుకునే అవకాశం కనిపిస్తోంది.
Injury, in general, teaches you to appreciate every moment. I’ve had my share of injuries throughout my career. It’s humbling. It gives you perspective. No matter how many times I’ve been hurt, I’ve learned from that injury and come back even more stronger 💪🏻💪🏻💪🏻💪🏻💪🏻 pic.twitter.com/EsDLZd30Y7
— Mohammad Shami (@MdShami11) December 3, 2022
ఉమ్రాన్ మాలిక్ ఇటీవలన్యూజిలాండ్‌తో జరిగిన టీ20, వన్డే సిరీస్‌లో ఆకట్టుకున్నాడు. వన్డే సిరీస్‌లో టీమిండియా తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. మూడు మ్యాచ్‌ల్లో మూడు వికెట్లు తీశాడు.
కివీస్ టూర్‌కు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్‌తోపాటు షమీకి కూడా విశ్రాంతి లభించింది. అంతకుముందు టీ20 ప్రపంచకప్‌లో షమీ పెద్దగా రాణించలేకపోయాడు. బంగ్లా టూర్‌కు రోహిత్, కోహ్లీ, రాహుల్ సహా సీనియర్ ఆటగాళ్లందరూ తిరిగి జట్టులోకి వస్తున్నారు.
బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్‌కు షమీ కాకుండా ప్రస్తుత జట్టులో ఇప్పటికే నలుగురు ఫాస్ట్ బౌలర్లు ఉన్నారు. వీరిలో శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, దీపక్ చాహర్, కుల్దీప్ సేన్ ఉన్నారు. ఉమ్రాన్ చేరిక జట్టుకు మరింత బలం చేకూరుతుంది. షమీ గాయం తీవ్రమైతే.. రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో మరో ఫాస్ట్ బౌలర్ జట్టులో స్థానం సంపాదించే అవకాశం ఖచ్చితంగా లభిస్తుంది.
ప్రస్తుతం ఢాకాలో ఉన్న భారత జట్టు శుక్రవారం ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొంది. ఈ సిరీస్‌తో వచ్చే ఏడాది స్వదేశంలో జరగనున్న వన్డే ప్రపంచకప్‌కు భారత జట్టు సన్నాహాలు ప్రారంభించనుంది. అందరి దృష్టి భారత టాప్ ఆర్డర్‌పైనే ఉంటుంది. రోహిత్, రాహుల్‌లు గత కొంతకాలంగా ఫామ్‌లో లేకపోవడం ఇబ్బందిపెడుతోంది.
బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్‌కు టీమిండియా: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్, శ్రేయాస్ అయ్యర్, రాహుల్ త్రిపాఠి, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), షాబాజ్ అహ్మద్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, దీపక్ చాహర్, కుల్దీప్ సేన్, ఉమ్రాన్ మాలిక్.
టెస్టు సిరీస్‌కి టీమిండియా: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), శుభ్‌మన్ గిల్, ఛతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), కేఎస్ భరత్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమేష్ యాదవ్.
Also Read: Child Stuck in Lift: లిఫ్ట్‌లో ఇరుక్కుపోయిన బాలుడు.. డోర్ ఓపెన్ కాకపోవడంతో ఏం చేశాడో చూడండి
Also Read: Hcu Thailand Student: హెచ్‌సీయూ అత్యాచారయత్న ఘటనలో ట్విస్ట్.. ఇంటికి తీసుకువెళ్లి మద్యం సేవించి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter , Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి