Snake Found on Flight: స్నేక్స్ ఆన్ ఏ ప్లేన్ అనే హాలీవుడ్ సినిమాను గుర్తుచేస్తూ దుబాయ్ విమానాశ్రయంలో ఓ ఘటన చోటుచేసుకుంది. ప్రయాణికులు విమానంలోంచి కిందకు దిగే సమయంలో లగేజీ పెట్టుకునేందుకు వీలుగా ఉండే కార్గొ హోల్డ్‌లో పాము ప్రత్యక్షమైంది. దీంతో పామును చూసిన ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఆ భయంతోనే కంగారులులో అటుఇటు పరుగులు పెట్టారు. అయితే, ఈ ఘటన విమానం గాల్లో ఉన్నప్పుడు కాకుండా ఎయిర్ పోర్టులో ల్యాండ్ అయ్యాకా జరగడంతో అందరూ హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు.
కేరళలోని క్యాలికట్ నుంచి దుబాయ్ వెళ్లిన ఎయిర్ ఇండియా B737 800 ఎయిర్ క్రాఫ్ట్ విమానం దుబాయ్ విమానాశ్రయం చేరుకున్న అనంతరం ప్రయాణికులకు ఎదురైన వింత అనుభవం ఇది. విమానంలోకి పాము చొరబడినట్టు గుర్తించిన ప్రయాణికులు.. విమానంలోనే అటుఇటు ఉరుకులు పరుగులు పెట్టడంతో ఆ విషయం విమానం సిబ్బంది దృష్టికి వెళ్లింది. అయితే, సిబ్బందికి కూడా ఇలాంటి అనుభవం కొత్తే కావడంతో వారు దుబాయ్ విమానాశ్రయంలోని ఎయిర్ ఇండియా అధికారులకు చేరవేశారు.
విమానం సిబ్బంది, ఎయిర్ ఇండియా అధికారులు ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన అగ్నిమాపక శాఖ అధికారులు.. ఆ పాము ఆచూకీని పట్టుకునే పనిలో పడ్డారు. అయితే, అంతకంటే ముందుగా విమానంలో ఉన్న ప్రయాణికులను సురక్షితంగా ఖాళీ చేయించి కిందకు దించేయడంతో అందరూ హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం విమానంలో పొగపెట్టి పామును బయటికి వెళ్లగొట్టే ప్రయత్నం చేశారు. మొత్తానికి విమానంలో పాము ఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తరచుగా విమానాల్లో ప్రయాణించే వారిలో కొందరు ఈ ఘటనను చూశాకా ఆ స్థానంలో తమని తాము ఊహించుకుని అలాంటి అనుభవం తమకే ఎదురైతే పరిస్థితి ఏంటా అని హడలిపోతున్నారు.
ఇది కూాడా చదవండి : Snake Eats Snake: బతికున్న రాటిల్ స్నేక్‌ను మింగేసిన కాటన్‌మౌత్ స్నేక్.. వీడియో చూస్తే పోసుకోవడం పక్కా!
ఇది కూాడా చదవండి : Child King Cobra Viral Video: ఆడుకుంటున్న పిల్లాడి వద్దకు వచ్చిన భారీ కింగ్ కోబ్రా.. చివరికి ఏమైందంటే? వీడియో చూస్తే వణికిపోతారు
ఇది కూాడా చదవండి : Metro Towel Viral Video: బనియన్, టవల్‌తో మెట్రో ఎక్కిన యువకుడు.. పడిపడి నవ్వుకున్న అమ్మాయిలు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook