Jio Phone 5G: సూపర్ ఫీచర్స్‌తో అతి తక్కువ ధరకే జియో 5G ఫోన్.. త్వరలోనే లాంచ్

Jio Phone 5G Specifications: జియో అత్యంత చౌకైన 5G స్మార్ట్‌ఫోన్‌ త్వరలోనే రాబోతోంది. ఖరీదైన ఫోన్లలో ఉండే ఫీచర్లు ఈ ఫోన్‌లో అందుబాటులో ఉండనున్నాయి. అద్భుతమైన ఫీచర్లను తెలుసుకోండి..  

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 13, 2022, 09:19 AM IST
  • త్వరలోనే జియో ఫోన్ 5G రిలీజ్
  • అద్భుతమైన ఫీచర్లతో తక్కువ ధరకే..
  • ఆ ఫీచర్ మాత్రం హైలెట్
Jio Phone 5G: సూపర్ ఫీచర్స్‌తో అతి తక్కువ ధరకే జియో 5G ఫోన్.. త్వరలోనే లాంచ్

Jio Phone 5G Specifications: దేశంలో ఇటీవలే 5G స్మార్ట్ ఫోన్లకు డిమాండ్ బాగా పెరిగిపోయింది. భారత్‌లోనే 5G ఫోన్లను తయారు చేసి అమ్ముతుండడంతో వీటి వాడకం బాగా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలోనే త్తగా స్మార్ట్ ఫోన్లు కొనుగోలు చేసే వారు 5G ఫోన్ల వైపే మొగ్గు చూపుతున్నారు. డిమాండ్ బాగా పెరుగుతుందని ముందే గ్రహించిన రిలయన్స్ జియో.. తన మొదటి 5G స్మార్ట్‌ఫోన్‌ను 2022లో విడుదల చేయనున్నట్లు గతేడాదే ప్రకటించింది. జియో ఫోన్ 5Gను జూలైలో లాంచ్ చేస్తామని చెప్పినా.. కానీ ఆ సమయంలో ఫోన్ రిలీజ్ కాలేదు. 

ఫోన్ గీక్‌బెంచ్ లిస్టింగ్‌లో కనిపిస్తున్నందున అతి త్వరలో పరిచయం కాబోతుందని నిపుణులు భావిస్తున్నారు. ఈ ఫోన్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS)లో కనిపించింది. మోడల్ నంబర్ LS1654QB5తో ఫోన్ ధృవీకరణ వెబ్‌సైట్‌లో గుర్తించారు. లిస్టింగ్‌లో ఉన్న ఫోన్ గురించి ఇప్పటివరకు ఎలాంటి సమాచారం వెల్లడి కాలేదు. అయితే ఫోన్‌కు సంబంధించి చాలా విషయాలు తెరపైకి వచ్చాయి. 

జియో ఫోన్ 5G స్పెసిఫికేషన్స్

జియో ఫోన్ 5Gకి 6.5-అంగుళాల HD+LCD డిస్‌ప్లే ఉంటుందని ప్రచారం జరుగుతోంది. ఇది 90HZ రిఫ్రెష్ రేట్‌ను పొందుతుంది. ఇది కాకుండా ఫోన్ ఆండ్రాయిడ్ 12 సంబంధిత సిస్టమ్ కావచ్చు. దీనికి ప్రగతిఓఎస్ అనే వెర్షన్ ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు.

జియో ఫోన్ 5G బ్యాటరీ

Jio ఫోన్ 5G 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000mAh బలమైన బ్యాటరీని కలిగి ఉంటుంది. ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 480+ చిప్‌సెట్ ఉండవచ్చు. దీనిలో 4GB RAM + 64GB స్టోరేజీని జోడించే అవకాశం ఉంది. 

జియో ఫోన్ 5G కెమెరా

జియో ఫోన్ 5Gలో వెనుకవైపు రెండు కెమెరాలు అందుబాటులో ఉంటాయి. ఇందులో మొదటిది 13MP లెన్స్, రెండవది 2MP లెన్స్. ముందువైపు 8MP సెల్ఫీ షూటర్ ఉంటుంది. ఫోన్‌లో అనేక 5G బ్యాండ్‌లు, అనేక కనెక్టివిటీ ఫీచర్లు అందుబాటులో ఉంటాయి. ఈ ఫోన్ మార్కెట్‌లోకి వస్తే విపరీతంగా అమ్ముడయ్యే అవకాశం కనిపిస్తోంది. ఫోన్ ధర రూ.8 వేల నుంచి రూ.10 వేల మధ్య ఉండవచ్చని ప్రచారం జరుగుతున్నా.. ఖచ్చితమైన ధర ఇంకా వెల్లడి కాలేదు. హ్యాండ్‌సెట్ ధర రూ.15 వేలలోపు ఉండే అవకాశాలు ఉన్నాయి.

Also Read: Ap Secretariat System: గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు శుభవార్త

Also Read: IND vs BAN: బంగ్లాదేశ్‌తో మొదటి టెస్టు.. బీసీసీఐ అనూహ్య నిర్ణయం! రిషబ్‌ పంత్‌ పని అయిపోయింది  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News