Acid Attack on Delhi School Girl: రాజధాని ఢిల్లీలో దారుణం.. స్కూల్ విద్యార్థినిపై యాసిడ్‌ దాడి!

Delhi school girl admitted in Safdarjung hospital after Acid Attack. దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. పాఠశాలకు వెళ్తున్న బాలికపై ఓ బాలుడు యాసిడ్ పోశాడు.   

Written by - P Sampath Kumar | Last Updated : Dec 14, 2022, 02:00 PM IST
  • రాజధాని ఢిల్లీలో దారుణం
  • స్కూల్ విద్యార్థినిపై యాసిడ్‌ దాడి
  • బాలిక పరిస్థితి విషమం
Acid Attack on Delhi School Girl: రాజధాని ఢిల్లీలో దారుణం.. స్కూల్ విద్యార్థినిపై యాసిడ్‌ దాడి!

Delhi School Girl Acid Attack: దేశ రాజధాని ఢిల్లీలో మరో దారుణం చోటుచేసుకుంది. బుధవారం (డిసెంబర్ 14) ఉదయం పాఠశాలకు వెళ్తున్న బాలికపై ఓ బాలుడు యాసిడ్ పోశాడు. ఈ ఘటనలో బాలికకు తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు ఆమెను హుటాహుటిన సఫ్దర్‌జంగ్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాలిక పరిస్థితి విషమంగా ఉందని సఫ్దర్‌జంగ్ వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు ఇలా ఉన్నాయి.  

బుధవారం ఉదయం 8.15 గంటల సమయంలో ఢిల్లీలోని ద్వారకా జిల్లా ఏరియాలో ప్లస్ 12 చదువుతున్న ఓ బాలిక పాఠశాలకు వెళుతోంది. ఉదయం కావడంతో మంచు దట్టంగా ఉంది. పాఠశాల విద్యార్థులు తప్ప ఎక్కువగా రద్దీ లేదు. ఈ సమయంలో ఇద్దరు వ్యక్తులు (బాలురు) నంబర్ ప్లేట్ లేని బైక్‌పై వచ్చి బాలికపై యాసిడ్‌ దాడి చేశారు. బైక్‌పై వెనకాల కూర్చున్న బాలుడు.. వెంట తెచ్చుకున్న యాసిడ్‌ను బాలిక ముఖంపై పోసి పారిపోయాడు. మంటతో బాలిక ఒక్కసారిగా కేకలు వేసింది. 

బాలిక అరుపులు విన్న స్థానికులు వెంటనే సఫ్దర్‌జంగ్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో బాలికకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం బాలిక పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఆస్పత్రికి వెళ్లి బాలిక నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. యాసిడ్‌ దాడికి పాల్పడిన బాలుడు ఎవరు?, బాలికపై ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది? అనే కోణాల్లో ఢిల్లీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: లక్ష్మీనారాయణ యోగం.. ఈ 3 రాశుల వారికి అదృష్టమే! కొత్త సంవత్సరంలో ప్రమోషన్‌తో పాటు ధనలాభం  

Also Read: Sun Transit 2022: డిసెంబర్ 16న త్రిగ్రాహి యోగం.. ఈ 4 రాశుల వారికి పెద్ద వరం! పదవి, ధనం, ప్రేమ మీ సొంతం  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.

 

Trending News