పాకిస్థాన్‌లోని లాహోర్‌లోకి భారత ఆర్మీ ఎప్పుడైనా ప్రవేశిస్తుందని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆరెస్సెస్) నేత ఇంద్రేష్ కుమార్ వ్యాఖ్యానించారు. పాక్ భూభాగంలోకి ప్రవేశించి 300 మంది ఉగ్రవాదులను ఏకిపారేసిన సర్జికల్ దాడులే ఇందుకు నిదర్శనం అన్నారు. 'భారత్‌లో ప్రస్తుత పరిస్థితులు'పై ఆయన మాట్లాడుతూ.. జమ్ముకాశ్మీర్‌లోని సంకీర్ణ ప్రభుత్వ మద్దతుతో పాక్ భూభాగంలోకి ప్రవేశించి 300 మంది ఉగ్రవాదులను ఏకిపారేశామన్నారు. ప్రభుత్వంలో ఉన్న బీజేపీ.. ఆర్మీకి, ఎన్‌ఐఏ నిఘా విభాగాలకు పూర్తిస్థాయిలో స్వేచ్ఛ ఇవ్వడం వల్లే ఉగ్రవాదులను ఏరివేస్తూ పాక్‌ను దెబ్బతీసినట్లు చెప్పారు.
జమ్మూ మరియు కాశ్మీర్ ప్రభుత్వ మద్దతు లేకుండా సర్జికల్ దాడులకు సాధ్యం కాదని ఇంద్రేష్ కుమార్ చెప్పారు. జమ్మూకాశ్మీర్ ప్రభుత్వం మద్దతుతోనే కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగిందన్నారు. లాహోర్‌లో మేం ఇంద్రేష్ కుమార్ ప్రవేశిస్తామని తెలపడమే సర్జికల్ దాడుల సారాంశమని అభిప్రాయపడ్డారు.
అఖండ భారతాన్ని పునర్నిర్మించాలని తాము కలలు కంటున్నామని.. నాగ్‌పూర్, లాహోర్/రావల్పిండిలలో సొంతిల్లు కట్టుకోవాలనుందన్నారు. ఆరెస్సెస్ వ్యవస్థాపకుడు కేబీ హెగ్డేవార్, రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్‌ల భావజాలంతో నవ భారత నిర్మాణం జరుగుతుందని ఇంద్రేష్ కుమార్ వివరించారు.
సర్జికల్ దాడుల వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పాక్‌లో ఏ క్షణాన్నైనా భారత ఆర్మీ ప్రవేశిస్తుంది