Dates Benefits: రోజూ పరగడుపున తీసుకుంటే కలిగే లాభాలు వింటే నోరెళ్లబెట్టాల్సిందే

Dates Benefits: ఖర్జూరం నిజంగానే అద్భుతమైన ఫ్రూట్. ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే కలిగే ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. ఖర్జూరంతో కలిగే లాభాలేంటో తెలుసుకుందాం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 1, 2023, 09:40 PM IST
Dates Benefits: రోజూ పరగడుపున తీసుకుంటే కలిగే లాభాలు వింటే నోరెళ్లబెట్టాల్సిందే

ఎడారి ఫ్రూట్ ఖర్జూరం ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ఉండే పోషక పదార్ధాలతో చాలా ప్రయోజనాలున్నాయి. ఇందులో ఫైబర్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, విటమిన్ బి6, ఐరన్ పుష్కలంగా లభిస్తాయి. అందుకే ఖర్జూరం రోజూ పరగడుపున తీసుకుంటే చాలా ప్రయోజనాలున్నాయి.

ఉదయం పరగడుపున ఖర్జూరం తీసుకుంటే కలిగే లాభాలు

అధిక బరువుకు చెక్

రోజూ ఉదయం పరగడుపున ఖర్జూరం తినడం వల్ల అధిక బరువుకు చెక్ పెట్టవచ్చు. అందుకే బరువు తగ్గించుకోవాలనుకుంటే..ఉదయం లేచిన వెంటనే..ఖర్జూరం తప్పకుండా తినాలి. ఎందుకంటే ఖర్జూరం తినడం వల్ల ఎక్కువసేపు ఆకలేయకుండా ఉండగలుగుతారు. ఫలితంగా అధిక బరువు సమస్యకు చెక్ పెట్టవచ్చు.

ఎనర్జీ కోసం

రోజూ ఉదయం వేళ పరగడుపున ఖర్జూరం తింటే శరీరానికి రోజంతా కావల్సిన ఎనర్జీ లభిస్తుంది. ఇందులో ఐరన్ పుష్కలంగా ఉండటం వల్ల శరీరంలో హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుంది. 

జీర్ణక్రియ మెరుగుపడటం

కడుపు సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్నవాళ్లు...ఉదయం వేళ ఖర్జూరం తినాలి. ఇందులో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మల విసర్జన సులభమౌతుంది. ఫలితంగా మలబద్ధకం సమస్య, గ్యాస్ సమస్య దూరమౌతాయి.

స్వీట్స్ తినే కోరిక తగ్గడం

చాలామందికి స్వీట్స్ అంటే మక్కువ ఎక్కువ. కానీ స్థూలకాయం, డయాబెటిస్ వంటి సమస్యలుంటే స్వీట్స్‌కు దూరంగా ఉండాల్సిందే. ఈ పరిస్థితుల్లో ఖర్జూరం మంచి ప్రత్యామ్నాయం కాగలదు. ఖర్జూరం తినడం వల్ల స్వీట్స్ తినాలనే కోరిక తగ్గుతుంది. 

Also read: Covid19 and Cold Difference: జలుబు లేదా ఒమిక్రాన్ బీఎఫ్.7 వేరియంట్ ఎలా గుర్తించడం, తేడా ఏంటి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News