నారా లోకేష్ అసెంబ్లీ స్థానంపై డిప్యూటీ సీఎం చినరాజప్ప కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటి వరకు ఎమ్మెల్సీగా కొనసాగుతూ మంత్రి పదవి చేపట్టిన లోకేష్ ..వచ్చే ఎన్నికల్లో ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తారని వెల్లడించారు. లోకేష్ ఏ స్థానంలో పోటీ చేస్తారని మీడియా అడిగిన పశ్నికు బదులిస్తూ ఆయనకు నచ్చిన అసెంబ్లీ స్థానంలో పోటీ చేస్తారని సమాధానామిచ్చారు. లోకేష్ ఏ స్థానంలో పోటీ చేయాలనేది ఆయన ఇష్టా ఇష్టాలపై ఉందని.. ఆయన ఏ స్థానంలో పోటీ చేసినా గెలుపు తథ్యమని ధీమా వ్యక్తం చేశారు.
టీడీపీ ఒంటరిగా బరిలో దిగే ఛాన్స్
కార్యకర్తలే టీడీపీకి బలం అని.. ఎవరితోనూ పొత్తు లేకుండానే గెలిసే సత్తా తమకు ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో పొత్తు లేకుండానే బరిలోకి దిగే అవకాశముందన్నారు. జనసేన పార్టీపై స్పందిస్తూ తాము పవన్ మాదిరిగా పార్ట్ టైమ్ నాయకులం కాదని..నిత్యం ప్రజల్లో ఉండేవాళ్లమన్నారు. సినిమా రాజకీయాలు తమకు చేతకాదని ఎద్దేవ చేశారు. బీజేపీతో పవన్, జగన్ కుమ్మక్కయ్యారని ఈ సందర్భంగా చినరాజప్ప ఆరోపించారు.