Green Tea Tips: గ్రీన్ టీ ఏ సమయంలో తీసుకుంటే మంచిదో తెలుసా

Green Tea Tips: మనం తీసుకునే ఆహార పదార్ధాలు లేదా టీ, కాఫీల కారణంగా రోజంతా యాక్టివ్‌గా ఉండే పరిస్థితి ఉంటుంది. అయితే ఏవి మంచివి, ఏవి కావనేది తెలుసుకోవాలి. ప్రతిరోజూ ఉదయం ప్రారంభం అనేది మంచి ఆహారంతో ఉండాలి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Feb 21, 2023, 02:22 PM IST
Green Tea Tips: గ్రీన్ టీ ఏ సమయంలో తీసుకుంటే మంచిదో తెలుసా

ప్రపంచవ్యాప్తంగా మెజార్టీ ప్రజలు ప్రతిరోజూ ఉదయం ప్రారంభం టీ, కాఫీలతో చేస్తుంటారు. శరీరం మెటబోలిజం వృద్ధి చెందడం ద్వారా..రోజంతా యాక్టివ్‌నెస్ ఉంటుంది. వీటితో పాటు గ్రీన్ టీ, బ్లాక్ టీ, బ్లూ టీ, వైట్ టీ వంటివి కూడా చాలా అందుబాటులో ఉన్నాయి. ఇందులో ఆరోగ్యం కోసం ఎక్కువమంది గ్రీన్ టీను ఆశ్రయిస్తుంటారు. 

గ్రీన్ టీ ప్రయోజనాలు

సాధారణ టీతో పోలిస్తే గ్రీన్ టీ అద్భుతమైన ఆరోగ్య ప్రదాయినిగా చెప్పవచ్చు. ఇందులో అద్భుతమైన పోషక గుణాలుంటాయి. ముఖ్యంగా యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు అధికంగా ఉంటాయి. గ్రీన్ టీని రోజువారీ డైట్‌లో భాగంగా చేసుకుంటే మంచి ఫలితాలుంటాయి. గ్రీన్ టీతో కలిగే ప్రయోజనాలు అందరికీ తెలిసినవే. కానీ గ్రీన్ టీ తాగేందుకు సరైన సమయం ఏంటనేది మీలో ఎంతమందికి తెలుసు. ఆ వివరాలు ఇప్పుడు పరిశీలిద్దాం..

ఒక కప్పు గ్రీన్ టీ ద్వారా శరీరానికి ఏం లభిస్తుందనేది పరిశీలిద్దాం. ఇందులో ఉండేది కెఫీన్. సాధారణ టీతో పోలిస్తే బ్లాక్ టీలో కెఫీన్ అధికంగా ఉంటుంది. గ్రీన్‌లో కూడా కెఫీన్ ఉంటుంది. అందుకే రోజులో ఎప్పుడు పడితే అప్పుడు గ్రీన్ టీ సేవించడం ఆరోగ్యానికి మంచిది కాదు. ఎందుకంటే కెఫీన్ ఆరోగ్యంపై విచిత్ర ప్రభావాన్ని చూపిస్తుంది. అందుకే గ్రీన్ టీని సరైన సమయంలో తాగాల్సి ఉంటుంది. తద్వారా ఎక్కువ ప్రయోజనాలుంటాయి. గ్రీన్ టీని బ్రేక్ ఫాస్ట్  లేదా లంచ్‌కు గంట ముందు లేదా సాయంత్రం స్నాక్స్‌తో తీసుకోవడం ఉత్తమమైన సమయంగా భావిస్తున్నారు. 

గ్రీన్ టీ ఎక్కువగా సేవిస్తే కలిగే నష్టాలు

కడుపులో మంట, కడుపు సమస్య లేదా గ్యాస్, జీర్ణ సంబంధ సమస్యలు, తలనొప్పి, ఆందోళన, నిద్రలేమి, ఎనీమియా, బ్లీడింగ్ డిసార్డర్, లివర్ సమస్య, ఎముకలపై దుష్ప్రభావం

Also read: Skin Care Tips: వేసవి చర్మ సమస్యకు రామబాణం ఈ చిట్కాలు, ట్యానింగ్ సమస్యకు ఇట్టే పరిష్కారం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News