YS Sharmila: తెలంగాణలో హిజ్రాలు ఆందోళన.. వైఎస్ షర్మిల క్షమాపణలు

YS Sharmila Says Sorry To Transgender: బీఆర్ఎస్ కార్యకర్తల దాడిలో గాయపడిన కాంగ్రెస్ నాయకుడు పవన్‌ను వైఎస్ షర్మిల బుధవారం పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు. హిజ్రాలు చేస్తున్న ఆందోళనపై కూడా ఆమె స్పందించారు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 22, 2023, 03:47 PM IST
  • హిజ్రాలను అవమానించాలనే ఉద్దేశం లేదు
  • ఎమ్మెల్యే వ్యాఖ్యలను తిప్పికొట్టే ప్రయత్నం చేశా..
  • హిజ్రాల మనసు నొప్పించిఉంటే క్షమాపణలు: వైఎస్ షర్మిల
YS Sharmila: తెలంగాణలో హిజ్రాలు ఆందోళన.. వైఎస్ షర్మిల క్షమాపణలు

YS Sharmila Says Sorry To Transgender: వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల క్షమాపణలు చెప్పాలని తెలంగాణ వ్యాప్తంగా హిజ్రాలు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. మహాబూబాద్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే శంకర్ నాయక్‌ను కొజ్జా అంటూ షర్మిల విమర్శలు గుప్పించగా.. హిజ్రాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రాన్స్ జెండర్లపై అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. కొజ్జా అనే పదాన్ని వాడటం ఎంత వరకు సమంజసమని.. ఎమ్మెల్యే శంకర్ నాయక్‌తో పాటు, షర్మిల క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పదే పదే ఆ పదాన్ని వాడుతూ తమ ఆత్మ గౌరవం దెబ్బ తీస్తున్నారని ఫైర్ అయ్యారు. ఇక నుంచి ఇలాంటి పదాలు వాడి తిడితే.. రాష్ట్రంలో రాజకీయ నాయకులను తిరగనివ్వమని హెచ్చరించారు. 

ఈ నేపథ్యంలోనే వైఎస్ షర్మిల స్పందించారు. హిజ్రాలను కించపరిచే ఉద్దేశం తమకు లేదన్నారు. కేవలం ఒక ఎమ్మెల్యే తనను అవమానిస్తే.. తిప్పికొట్టే ప్రయత్నం చేశానని వివరణ ఇచ్చానని అన్నారు. హిజ్రాలకు సమాజంలో విలువ ఉందని చెప్పానని.. వారు సమాజంలో గొప్పగా బతుకుతున్నారని చెప్పానని అన్నారు. హిజ్రా అక్క చెల్లెలకు మనసు నొప్పించి ఉంటే.. బేషరతుగా క్షమాపణ చెబుతున్నానని తెలిపారు. వారికి తాను ఎల్లప్పుడు అండగా నిలబడతానని హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ కార్యకర్తల దాడిలో గాయపడిన యూత్ కాంగ్రెస్ వరంగల్ అధ్యక్షుడు పవన్‌ను వైఎస్ షర్మిల పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

'తెలంగాణలో రాష్ట్రపతి పాలన విధించాలి. గవర్నర్‌ను కలిసి రాష్ట్రపతి పాలన విధించాలని కోరుతాం. తెలంగాణలో రౌడీల రాజ్యం నడుస్తుంది. పోలీసులు బీఆర్ఎస్ ఫ్రెండ్లీ పోలీసులు. ప్రశ్నిస్తే ప్రతిపక్షాల మీద దాడులు చేస్తారా..? బీఆర్ఎస్ గూండాలు మనుషులా.. లేక మృగాలా..? తెలంగాణలో లా అండ్ ఆర్డర్ లేదు. పవన్ కోలుకోవడానికి అరు నెలలు పడుతుందని వైద్యులు చెప్పారు. పవన్ తల్లి శాపం సీఎం కేసీఆర్‌కు తగులుతుంది. ప్రతిపక్షాలకు సీఎం కేసీఆర్ క్షమాపణలు చెప్పాలి..' అని షర్మిల డిమాండ్ చేశారు.

హిజ్రాల మనసు నొప్పించే ఉంటే బేషరతుగా క్షమాపణలు చెబుతున్నానని ఆమె తెలిపారు. వాళ్లు కూడా ఒకసారి ఆలోచన చేయాలని కోరారు. కేసీఅర్ వాళ్ల జీవితాలను ఎలా ఆదుకున్నారో చెప్పాలన్నారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధికారంలో వచ్చాక హిజ్రాలకు అన్ని పతకాలు వర్తింపు చేస్తామని హామీ ఇచ్చారు. వారి మర్యాద పెంచేలా చూస్తామని మనసు స్ఫూర్తిగా మాట ఇస్తున్నామన్నారు. వారికి లోన్లు ఇస్తామని భరోసా ఇచ్చారు.

Also Read: Earthquak Today: ఢిల్లీ, చెన్నై నగరాల్లో భూకంపం.. భయాందోళనలో ప్రజలు  

Also Read: Deepak Chahar: సీఎస్‌కే ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ఐపీఎల్‌కు దీపక్ చాహర్ రెడీ

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News