Snake Catcher Caught 16 Feet Dangerous King Cobra: నల్లత్రాచు లేదా కింగ్ కోబ్రా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 12 నుంచి 20 అడుగుల పొడవు ఉండే కింగ్ కోబ్రా.. ప్రపంచంలో అత్యంత విషపూరితమైనది. ఎక్కువగా అడవుల్లో సంచరించే కింగ్ కోబ్రా కాటు వేస్తే మాత్రం 10-15 నిమిషాల్లో మనిషి ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. కాటేసే సమయంలో ఈ పాము ఎక్కువ విషంను చిమ్ముతుంది కాబట్టి మనిషిపై ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అందుకే కింగ్ కోబ్రా పేరు చెప్పగానే జనాలు భయంతో వణికిపోతారు. ఇక నేరుగా కనిపిస్తే ఇంకేమైనా ఉందా?.. వెనక్కితిరిగి చూడకుండా పరుగెత్తుతారు.
కింగ్ కోబ్రాను సాధారణ మనిషి పట్టుకోవడం అటుంచితే చంపడం కూడా దాదాపుగా అసాధ్యమే. కింగ్ కోబ్రా తనలో మూడో వంతు పడగెట్టడం, ఉగ్రరూపంతో చూడడం కారణంగా జనాలు చంపేందుకు వెనకడుగు వేస్తారు. సీనియర్ స్నేక్ క్యాచర్లు మాత్రమే కింగ్ కోబ్రాను ఒడుపుగా పట్టుకుంటారు. భారీ సైజ్ కింగ్ కోబ్రాలు అప్పుడపుడు స్నేక్ క్యాచర్లకు కూడా చుక్కలు చూపిస్తాయి. మనుషులకు హాని కలిగిస్తుంది కాబట్టి.. జన సంచారంలోకి వచ్చిన కింగ్ కోబ్రాను చాలా రిస్క్ చేసి స్నేక్ క్యాచర్లు పట్టి అడవుల్లో వదిలేస్తుంటారు.
సీనియర్ స్నేక్ క్యాచర్లకు సైతం కొన్ని కింగ్ కోబ్రాలు అస్సలు చిక్కవు. అయితే తాజాగా ఓ భారీ సైజ్ బ్లాక్ కింగ్ కోబ్రాను ఓ స్నేక్ క్యాచర్ చాలా ఈజీగా పట్టేశాడు. ఎంతలా అంటే.. అది పామా లేదా పిప్పరపట్టా అన్న అనుమానం రాక మానదు. ఓ మామిడి తోటలో 16 అడుగుల బ్లాక్ కింగ్ కోబ్రా సంచరిస్తుండగా.. కొందరు స్నేక్ క్యాచర్లు దాన్ని చూస్తారు. ఓ స్నేక్ క్యాచర్ హెల్మెట్ పెట్టుకుని దాని ముందు ఉండగా.. అది పడగవిప్పి అతడిని చూస్తుంటుంది. ఇంతలో వెనకాల నుంచి మరో స్నేక్ క్యాచర్ వచ్చి చాలా సునాయాసంగా తలను పెట్టేస్తాడు..
మరో ఇద్దరు స్నేక్ క్యాచర్లు వచ్చి బ్లాక్ కింగ్ కోబ్రాను పట్టుకుంటారు. ఆపై దాన్ని ఓ సంచిలో బంధిస్తారు. ఇందుకు సంబందించిన వీడియోను 'Nick Wildlife' అనే యూట్యూబ్ ఛానెల్లో పోస్ట్ చేశారు. ఈ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెల క్రితం పోస్ట్ చేసిన ఈ వీడియోకి 144,844 వ్యూస్ వచ్చాయి. ఈ ఆలస్యం ఎందుకు మీరు వీడియో చూసేసయండి.
Also Read: Hero Splendor Plus 2023: కేవలం 18 వేలకే హీరో స్ల్పెండర్ ప్లస్.. వెంటనే కోనేయండి! పూర్తి వివరాలు ఇవే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి