Ranveer Singh Surpasses Virat Kohli to become Most Valued Indian Celebrity in 2022: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ గురించి క్రికెట్ అభిమానులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఫార్మాట్ ఏదైనా, బౌలర్ ఎవరైనా, పిచ్ ఎలాంటిదైనా.. క్రీజులో కింగ్ కోహ్లీ ఉన్నాడంటే పరుగుల వరద పారాల్సిందే. తన అద్భుత ఆటతో కోహ్లీ ఇప్పటికే ఎన్నో రికార్డులను బద్దలు కొట్టాడు. అంతేకాదు ఎవరికీ సాధ్యం కానీ మరెన్నో రికార్డులను తన పేరుపై లిఖించుకున్నాడు. విరాట్ ఓ బ్రాండ్ అనడంలో సందేహం లేదు. ప్రపంచ వ్యాప్తంగా ఎందరో అభిమానులను సంపాదించుకున్న కోహ్లీకి బ్రాండ్ వాల్యూ కూడా అదే రేంజ్లో ఉంటుంది. అయితే ఇప్పుడు ఆ బ్రాండ్ వాల్యూ కాస్త తగ్గినట్టు తెలుస్తోంది.
భారత దేశంలోని మోస్ట్ వాల్యూబుల్ సెలబ్రిటీ ట్యాగ్‌ను టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కోల్పోయినట్లు తెలుస్తోంది. విరాట్ స్థానాన్ని బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ ఆక్రమించినట్లు సమాచారం. 2021లో కోహ్లీ బ్రాండ్ వాల్యూ 185.7 మిలియన్ డాలర్లు ఉండగా.. 2022లో 176.9 మిలియన్ డాలర్లకు పడిపోయిందట. అదే సమయంలో 2021లో 158.3 మిలియన్ డాలర్ల బ్రాండ్ వాల్యూ కలిగిన రణ్వీర్.. 2022లో 181.7 మిలియన్ డాలర్లకు దూసుకొచ్చాడు. దాంతో కోహ్లీ స్థానాన్ని రణ్వీర్ ఆక్రమించేశాడు.
గత ఐదేళ్లుగా విరాట్ కోహ్లీ వరుసగా భారత్ మోస్ట్ వాల్యూబుల్ సెలబ్రిటీగా కొనసాగుతున్నాడు. తాజాగా ఆ స్థానానికి గండి పడింది. టీ20 ప్రపంచకప్ 2021 తర్వాత పొట్టి ఫార్మాట్ స్వయంగా కెప్టెన్సీ వదిలేసిన కోహ్లీని.. జట్టు మేనేజ్మెంట్ వన్డే సారథ్య బాధ్యతల నుంచి తప్పించింది. ఆపై స్వయంగా కోహ్లీనే టెస్టు పగ్గాలు వదిలేశాడు. నిలకడలేమి ఫామ్ కారణంగానే ఇదంతా జరిగింది. ఇక మూడేల్ల పాటు సెంచరీ కూడా చేయలేదు. ఈ పరిణామాలు విరాట్ బ్రాండ్ వాల్యూపై ప్రభావం చూపాయి.
విరాట్ కోహ్లీ బ్రాండ్ వాల్యూలో ఈ స్వల్ప పతనం తాత్కాలికమేనని, త్వరలోనే పూర్వవైభవం అందుకుంటాడని క్రోల్ వాల్యూయేషన్ సర్వీసెస్ ఎండీ అవిరల్ జైన్ మనీ పేర్కొన్నారు. త్వరలోనే నాన్ క్రికెటర్‌గానూ వాల్యూబుల్ సెలబ్రిటీగా టాప్ స్థాయికి చేరుకోగలడని చెప్పారు. పలు బ్రాండ్లకు ఎండార్స్ చేస్తున్న కోహ్లీ.. టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ మాదిరి నాన్ క్రికెటింగ్ విభాగంలోనూ సత్తా చాటగలడని జైన్ చెప్పుకొచ్చారు.
Also Read: Brave Lady Traps Cobra: కాటు వేయటానికి వచ్చిన కింగ్ కోబ్రాను ఈజీగా కంట్రోల్ చేసిన అమ్మాయి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి