7th pay commission: గుడ్‌న్యూస్ 4 శాతం డీఏ పెంపుకు కేంద్ర కేబినెట్ ఆమోదం, ఎప్పట్నించంటే

7th pay commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్. కేంద్ర కేబినెట్ కరవుభత్యం పెంపుకు ఆమోదం తెలిపింది. అంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు డీఏ మరో 4 శాతం పెరగనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 25, 2023, 11:04 AM IST
7th pay commission: గుడ్‌న్యూస్ 4 శాతం డీఏ పెంపుకు కేంద్ర కేబినెట్ ఆమోదం, ఎప్పట్నించంటే

7th pay commission: ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర కేబినెట్ నిన్న అంటే శుక్రవారం భేటీ అయింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు జనవరి, 2023కు సంబంధించిన డీఏ పెంపుకు ఆమోదం తెలిపింది. ఎంత డీఏ పెరగనుంది, ఎంతమందికి లాభం కలగనుందో చూద్దాం..

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2023 సంవత్సరంలో తొలి డీఏ పెంపుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. జనవరి 1 నుంచి అమలు కావల్సిన ఈ డీఏ పెంపుకు నిన్న జరిగిన కేబినెట్ సమావేశం ఆమోదం తెలిపింది. 47.58 లక్షలమంది ఉద్యోగులు, 69.76 లక్షల మంది పెన్షనర్లు డీఏ పెంపు ద్వారా లబ్ది పొందనున్నారు. డీఏను 4 శాతం పెంచేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.

ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్..కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు,పెన్షనర్లకు కరవు భత్యం పెంపును ఆమోదించడమే కాకుండా జనవరి 1, 2023 నుంచి అమల్లోకి వచ్చేలా తీర్మానించింది. అంటే మూడు నెలల ఎరియర్లు కూడా రానున్నాయి. ఈ నిర్ణయం ద్వారా కేంద్ర ప్రభుత్వంపై ఏడాదికి అదనంగా 12,815.60 కోట్ల భారం పడనుంది. ప్రస్తుతం ఉన్న 38 శాతం డీఏకు అదనంగా 4 శాతం డీఏ పెరుగుతోంది. దాంతో మొత్తం డీఏ 42 శాతానికి చేరుకోనుంది.

కేంద్ర కేబినెన్ భేటీ అనంతరం కేంద్ర సమాచార శాఖ మంత్రి అనురాగ్ ఠాగూర్ మీడియాతో మాట్లాడారు. డీఏ, డీఆర్ పెంపు ద్వారా కేంద్ర ప్రభుత్వంపై అదనంగా 12,815.60 కోట్లు భారం పడనుందని తెలిపారు. 7వ వేతన సంఘం సిఫార్సుల మేరకు ఈ డీఏ పెంపు ప్రతియేటా రెండుసార్లు ఉంటోంది. 

గత ఏడాది సెప్టెంబర్ 28న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెరిగింది. ఈ పెరిగిన డీఏ జూలై1, 2022 నుంచి అమల్లోకి వచ్చిది. అంటే రెండు నెలల ఎరియర్లు కూడా అందాయి. ఆ తరువాత తిరిగి జనవరి 1, 2023 నుంచి పెరగాల్సిన డీఏకు నిన్న ఆమోదం లభించింది. 

Also read: NPS 2023: పెన్షన్ విధానంపై కేంద్రం ముందడుగు.. లోక్‌సభలో ఆర్థిక మంత్రి ప్రకటన

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Faceboo

Trending News