Dil Raju Clarity on Political Entry: గత కొద్దిరోజులుగా దిల్ రాజు అనూహ్యంగా వార్తల్లోకి వస్తూనే ఉన్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దిల్ రాజు ప్రొడక్షన్స్ పేరుతో ఆయన కుమార్తె ప్రారంభించిన నిర్మాణ సంస్థ బలగం సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. అయితే బలగం సినిమాని తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో ప్రొజెక్టర్ల ద్వారా ప్రదర్శనలు వేస్తూ ఉండడంతో దిల్ రాజు ప్రొడక్షన్స్ పేరిట ఆ సంస్థకు సంబంధించిన కొందరు వ్యక్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ సినిమా డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియోకి అమ్మేశాం కాబట్టి ఇలా బహిరంగంగా ప్రదర్శించడం కరెక్ట్ కాదని చెబుతూ, ప్రదర్శనల విషయంలో చర్యలు తీసుకోవాలని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే లేఖ మీద దిల్ రాజు ప్రొడక్షన్స్ పేరుతో ఉండడంతో ఈ ఫిర్యాదు దిల్ రాజే ఇచ్చారని చాలా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఇక ఈ అంశాల మీద తాజాగా దిల్ రాజు స్పందించారు. గ్రామాల్లో బలగం సినిమా ప్రదర్శనల గురించి ఆయన మాట్లాడారు.
గ్రామాల్లో మా బలగం సినిమా ప్రదర్శనను నేను అడ్డుకోవడం లేదని నిజానికి సినిమాకు ప్రేక్షకులు చేరువ కావడమే తమ లక్ష్యం అని దిల్ రాజూ చెప్పుకొచ్చారు. మా బలగం సినిమా చూసి ప్రేక్షకులలో మనస్పర్ధలు తొలగిపోయి కలుసుకుంటున్నారని, ప్రజల వివాదాలు మానేసి కలుస్తున్నారంటే అంతకన్నా అదృష్టం ఏముంటుందని దిల్ రాజు ప్రశ్నించారు. ఇక ఇదే సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ రాజకీయం గురించి కూడా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. దిల్ రాజుకు సినీ గ్లామర్ ఉండడంతో ఆయన పొలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని ఒకో సందర్భంలో ప్రచారం జరుగుతూ ఉంటుంది.
ఈ విషయం మీద స్పందించిన దిల్ రాజు తాను తన పేరు మీద సినీ పరిశ్రమలో చిన్న మాట వస్తేనే తట్టుకోలేనని అలాంటిది రాజకీయాల్లో అనేక అడ్డంకులు ఉంటాయని అన్నారు. రాజకీయాల్లో తన మీద విమర్శలు చేస్తే తాను తట్టుకోలేనేమో అని అర్థం వచ్చేలా ఆయన వ్యాఖ్యలు చేశారు. అంతేకాక తాను రాజకీయాల్లోకి వస్తానా రానా అనేది ప్రస్తుతానికి అప్రస్తుతం అంటూ ఆయన ఈ అంశం మీద దాటవేసే ప్రయత్నం చేశారు. ఇక మొదటి భార్య చనిపోవడంతో దిల్ రాజు ఈ మధ్యనే వైఘా రెడ్డి అనే అమ్మాయిని రెండో వివాహం చేసుకున్నారు. వారికి ఒక కుమారుడు కూడా జన్మించాడు. ప్రస్తుతానికి దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ మీద పలు భారీ ప్రాజెక్టులు తెరకెక్కిస్తున్నారు.
Also Read: Budh Gochar 2023: జూన్ 7 నాటికి, ఈ 3 రాశుల వారికి ఊహించని ఆర్థిక సమస్యలు.. మామూలు దెబ్బ కాదిది!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook