Delhi Capitals Vs Gujarat Titans Dream11 Team Prediction For Match 7 of IPL 2023: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2023లో మరో హైఓల్టేజ్ మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. మంగళవారం రాత్రి 7 గంటలకు టాస్ పడనుండగా.. 7.30 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. డిఫెండింగ్ ఛాంపియన్స్ గుజరాత్ టైటాన్స్ ఈ సీజన్ తొలి మ్యాచులో చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించింది. దాంతో మరో విజయం సాదించేందుకు చూస్తోంది. మరోవైపు లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మొదటి మ్యాచులో ఓడిన ఢిల్లీ క్యాపిటల్స్.. మెగా టోర్నీలో ఆరంభం చేయాలని చూస్తోంది.
అన్ని విభాగాల్లో రాణిస్తున్న గుజరాత్ టైటాన్స్ జట్టుకు తొలి మ్యాచ్‌లో గాయపడ్డ న్యూజిలాండ్ స్టార్ ఆటగాడు కేన్ విలియమ్సన్ దూరమవడం పెద్ద లోటే అని చెప్పాలి. అయితే కేన్ మామ స్థానాన్ని దక్షిణాఫ్రికా స్టార్ బ్యాటర్ డేవిడ్ మిల్లర్ భర్తీ చేసే అవకాశాలు ఉన్నాయి. మిల్లర్ తుది జట్టులోకి వస్తే గుజరాత్ జట్టు బ్యాటింగ్ మరింత పటిష్టం అవుతుంది. శుభ్‌మన్ గిల్, వృద్ధిమాన్ సాహా, విజయ్ శంకర్, హార్దిక్ పాండ్యా, రషీద్ ఖాన్, అల్జారీ జోసెఫ్, మొహ్మద్ షమీ లాంటి స్టార్ ప్లేయర్స్ జట్టులో ఉన్నారు.
దక్షిణాఫ్రికా పేసర్ ఆన్రిచ్ నోర్జ్ తుది జట్టులోకి రానున్నాడు. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ విభాగం మరింత బలంగా మారుతోంది. అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, చేతన్ సకారియా, మిచెల్ మార్ష్‌లు కూడా ఉన్నారు. ఇక బ్యాటింగ్ విభాగంలో పృథ్వీ షా, డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, సర్ఫరాజ్ ఖాన్, రోవ్మాన్ పావెల్ చెలరేగితే ఢిల్లీకి తిరుగుండదు.
తుది జట్లు (అంచనా):
గుజరాత్: శుభ్‌మన్ గిల్, వృద్ధిమాన్ సాహా, విజయ్ శంకర్, హార్దిక్ పాండ్య, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాతియా, రషీద్ ఖాన్, అల్జారీ జోసెఫ్, జోష్ లిటిల్, మొహ్మద్ షమీ, సాయి సుదర్శన్.
ఢిల్లీ: పృథ్వీ షా, డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, సర్ఫరాజ్ ఖాన్, రోవ్మాన్ పావెల్, అమాన్ ఖాన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, చేతన్ సకారియా, అన్రిచ్ నార్జ్, ఖలీల్ అహ్మద్.
డ్రీమ్ 11 టీమ్ (DC vs GT Dream11 Team Today):
శుభమన్ గిల్ (కెప్టెన్), డేవిడ్ వార్నర్, పృథ్వీ షా, సాయి సుదర్శన్, వృద్ధిమాన్ సాహా (కీపర్), మిచెల్ మార్ష్, హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), అక్షర్ పటేల్, రషీద్ ఖాన్, మహ్మద్ షమీ, అల్జారీ జోసెఫ్.
Also Read: OnePlus Nord CE 3 Lite: వన్‌ప్లస్ నుంచి చౌకైన 5G స్మార్ట్‌ఫోన్.. ధర, ఫీచర్ల వివరాలు ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి