Headless Snake Attacks on Men: తల తెగిన పాము పగపడుతుందా ? తల తెగిన పామును ఎవరైనా ఏమైనా అంటే అది వారిపైకి తిరిగి ప్రతిఘటిస్తుందా ? తల తెగిన పాము ఎంతసేపు బతికుంటుంది ? తల తెగిన పాముకు బ్రెయిన్ సెన్స్ ఎలా పనిచేస్తుంది ? తల తెగిన వెంటనే పాముకు ప్రాణం పోదా ? ఈ వీడియో చూసిన వాళ్లకు చాలామందికి కలుగుతున్న అనేక సందేహాలు ఇవి. అందుకు కారణం తల లేకుండానే ఒక పాము తన తోకను పట్టుకున్న వ్యక్తిని దాదాపు కాటు వేసినంత వేగంగా తల ఉన్న భాగాన్ని తిప్పి కొట్టింది. అది చూసి ఆ వ్యక్తి కూడా జడుసుకుని వెనక్కి జరిగాడు అంటే ఆ పాము ఎంత వైల్డ్ గా రియాక్ట్ అయిందో అర్థం చేసుకోవచ్చు.
అందుకే ఈ వీడియో చూసిన వాళ్లందరికీ రకరకాల సందేహాలు కలుగుతున్నాయి. ఏ జీవికైనా తల తెగితే వెంటనే ప్రాణం పోతుంది. మహా అయితే కొన్ని క్షణాల పాటు కొట్టుమిట్టాడి ప్రాణాలు వదిలేస్తుంది. తల తెగిన జీవికి మెదడు ఉండదు కనుక అది ఎప్పటిలా రియాక్ట్ అయ్యే గుణాన్ని కూడా కోల్పోతుంది. కానీ ఈ వీడియోలో చూస్తున్న పాము మాత్రం తోక తొక్కిన తాచులా తన తోకను పట్టుకున్న వ్యక్తిపై లేవడమే ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
ఇది కూడా చదవండి : Road Accident Viral Video: వర్షంలో స్కిడ్ అయిన బైక్.. వెనకాలే వేగంగా వచ్చిన ట్రక్కు.. ఏం జరిగిందో చూస్తే మీ కళ్లను మీరే నమ్మలేరు
ఈ వీడియో అప్‌లోడ్ చేసిన వ్యక్తి పేర్కొన్న వివరాల ప్రకారం ఆ పాముకు తల తెగి అప్పటికే 5 గంటలు అవుతోంది. తన స్నేహితుడి ఇంట్లో పిల్లలు ఉయ్యాల ఊగే చోట ఉన్న పామును అతడు తలపై కొట్టాడని.. ఆ తరువాత ఆ పామును తాను ఇంట్లోకి తీసుకొచ్చానని ఆ వ్యక్తి వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్‌లో పేర్కొన్నాడు. ఇంతకీ ఆ వ్యక్తి చెప్పింది నిజమేనా ? పాముకే కాదు.. ఏ జీవికైనా తల తెగిపడ్డాకా 5 గంటల సేపు జీవం ఉంటుందా ? ఇవి ఈ వీడియో చూసిన నెటిజెన్స్ వ్యక్తంచేస్తున్న సందేహాలు. ఏదేమైనా రెండేళ్ల క్రితం ఓ యూట్యూబర్ అప్‌లోడ్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియో చూసిన నెటిజెన్స్ ఎవరికి తోచిన కామెంట్స్ వారు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి : Monkey Funny Video: వీడియో కోసం కోతికి అన్నం పెట్టింది.. ఏం జరిగిందో చూస్తే నవ్వాపుకోలేరు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook