Miss Femina 2023: ఫెమినా మిస్ ఇండియా ప్రపంచంలో మరో కొత్త అందం మిలమిల మెరిసిపోయింది. ఇటీవల జరిగిన 59వ సౌందర్య పోటీల్లో నందిని గుప్తా మిస్ ఇండియాగా నిలిచింది. ఇదే పోటిల్లో ఢిల్లీకి వాసి శ్రేయా పూంజా ప్రథమ రన్నరప్‌గా నిల్వగా.. మణిపూర్‌కు చెందిన తౌనోజం స్ట్రెలా లువాంగ్ ద్వితీయ రన్నరప్‌గా నిలిచింది. ఈ మిస్ ఇండియా పోటిలు మణిపూర్ రాష్ట్రంలోని లంపాక్‌లో ఇండోర్ స్టేడియంలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు పలువురు బాలీవుడ్ హీరో, హీరోయిన్ల హాజరు కాగా.. స్టేడియం సందడిగా మారింది.
ఈ పోటీల్లో 29 రాష్ట్రాలకు చెందిన మహిళ అందగత్తెలు పోటీల్లో పాల్గొన్నారు. వారిని ఓడించి నందిని గుప్తా తన అందంలో మిస్ ఇండియాగా టైటిల్‌ను గెలుచుకుంది. అంతేకాకుండా ఆమె ఇప్పటివరకు చాలా సార్లు ఈ పోటీల్లో పాల్గొనగా ఈ సారి అమెకు అదృష్టం వరించింది.
Also Read: Harry Brook Century: చరిత్ర సృష్టించిన హ్యారీ బ్రూక్.. సన్‌రైజర్స్ హైదరాబాద్ చరిత్రలో 'ఒకే ఒక్కడు'!
ఇంతకు నందిని గుప్తా(Nandini Gupta)ఎవరో తెలుసా?
నందిని రాజస్థాన్‌లో కోటా నగరంలో నివాసం ఉంటుంది. అయితే బిజినెస్ మేనేజ్‌మెంట్‌లో డిగ్రీని పూర్తి చేసిన నందిని గుప్తాకు ఎప్పటి నుంచో మిస్ ఇండియా కావాలనే కోరిక ఉండేదటా..అయితే ఈ కోరిక ఇప్పుడు నెరవేరింది. ఈ మిస్ ఇండియా పోటీల్లో చాలా చేదు అనుభవాలు ఎదురవుతాయని తెలిసినప్పటికీ ఆమె ఏ మాత్రం వెనక అడుగు వేయలేదు. నందిని తన గోల్ కోసం నిరంతరం కృషి చేసింది. అంతేకాకుండా ఈ క్రమంలో ఏర్పడ్డ చిన్న చిన్న సమస్యలను, సవాళ్లను జయించడం కోసం మానసికంగా సిద్ధపడింది. అయితే ఆమె పోటీ చేసే క్రమంలో చాలా విమర్శలు వచ్చినప్పటికీ ఏ మాత్రం తన లక్ష్యానికి దూరం కాలేదు.
మిస్ ఇండియా పోటీలు 1947 సంవత్సరం నుంచే జరుగుతూ వస్తున్నాయి. ఈ అందాల పోటీల్లో ప్రతి సంవత్సరం వందలాది స్త్రీలు పాల్గొనే వారు. అయితే మిస్ ఇండియా తొలినాళ్లలో కోల్‌కతాకు చెందిన ప్రమీల (ఎస్తేర్ విక్టోరియా అబ్రహాం) మొదటి సారిగా గెలిచింది. ఈ మొదటి మిస్ ఇండియా పోటీలు జరిగిన తర్వాత రెండవ మిస్ ఇండియా పోటీలు జరగడానికి 5 సంవత్సరాలు పట్టింది. ముస్సోరీకి చెందిన ఇంద్రాణి రెహ్మాన్ కూడా 1952లో మిస్ ఇండియా మారారు. అయితే 1959 నుంచి ఇప్పటి వరకు ఈ పోటీలు జరుగుతూనే వచ్చాయి.
Also Read: Jio Cinema Charges: జియో సినిమాకు ఇకపై డబ్బులు చెల్లించాల్సిందే.. ఐపీఎల్ 203 మాత్రం..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.