భాతర్‌లో జైళ్ల పరిస్థితి బాగా లేదన్న కారణాన్ని సాకుగా చూపి తమ దేశంలో తలదాచుకున్న నేరగాళ్లను అప్పగించేలమని భారత్‌కు లండన్ కోర్టు తేల్చిచెప్పింది. వివారాల్లోకి వెళ్లినట్లయితే.. 2000లో సౌతాఫ్రికా క్రికెటర్ హ్యాన్సీ క్రోన్జేకు సంబంధమున్న మ్యాచ్ ఫిక్సింగ్ కేసులో సంజీవ్ కుమార్ చావ్లా అనే బుకీ, లండన్ లో తలదాచుకుని ఉండగా, అతని అప్పగింతపై సుదీర్ఘకాలంగా వాదనలు జరిగాయి. ఈ విషయంలో విచారణ జరిగిన కోర్టు ఈ మేరకు తన అభిప్రాయాన్ని వెల్లడించింది. అదేమంటే గతంలో భారత సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యాలను ఉటంకిస్తోంది.
విదేశాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు శుభవార్త.. ఇకపై వారికి కూడా పీఎఫ్ లో భాగస్వాములు కావొచ్చు. ఇందుకు సంబంధించి కేంద్ర కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీచేసింది. విదేశాల్లో ఉన్న ఉద్యోగులు తమకు పీఎఫ్ లో భాగస్తులుగా చేర్చాలని గత కొంతకాలంగా కేంద్రాన్ని కోరుతూ వచ్చారు. వారి విన్నపానికి కేంద్రం సానుకూలంగా స్పందించి ఇకపై వారు కూడా పీఎఫ్ ఖాతా తెరవచ్చని తెలిపింది.
న్యూజిల్యాండ్ ప్రధాని ప్రధానమంత్రి జసిండా అర్డెర్న్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. విదేశీయులు తమ దేశంలో ఇళ్లు కొనుగోలు చేయడంపై నిషేధం విధించారు. తాజా నిర్ణయం 2018 నుంచి ఈ నిషేదం అమల్లోకి రానుంది. అయితే ఈ విషయంలో ఆస్ట్రేలియన్లకు మాత్రం వర్తించదు. తాజా నిర్ణయం అమల్లోకి వస్తే ఆసీస్ మినహా ఇతరు దేశస్తులు ఇళ్లను కొనగోలు చేయడానికి వీల్లేదు.
దుబాయ్ లో విదేశీయుల ప్రాపర్టీ కొనుగోళ్లలో భారతీయులు ముందంజలో ఉన్నారు. గతేడాది 2016 జనవరి నుంచి ఈ ఏడాది 2017 జూన్ వరకు భారతీయులు దుబాయ్ లో రూ.42వేల కోట్ల విలువైన ఆస్తులను దక్కించుకున్నారు. భారతీయుల్లో ఎక్కువమంది అపార్ట్మెంట్లపై, మరికొందరు విలాలపై ఆసక్తిని చూపిస్తున్నారట. ఈ విషయం అక్కడి ల్యాండ్ డిపార్ట్మెంట్ వెల్లడించిన లెక్కల ద్వారా స్పష్టమవుతోంది.
ఇటీవల సంచలనం సృష్టించిన షెరినా మాథ్యూస్ మిస్టరీ వీడిందా? ఆ చిన్నారి సమీపంలోని డ్రైనేజీ టన్నెల్ లో శవంగా తేలిందా? టెక్సాస్ పోలీసులు చెబుతున్న వివరాల ప్రకారం చూస్తే.. ఈ విషయం నిజమేనేమో అని అనిపిస్తుంది. పాలు తాగలేదని మూడేళ్ళ చిన్నారిని అర్థరాత్రి ఇంటి బయట నిలబడమని శిక్షించాడు కన్న తండ్రి వెస్లీ మాథ్యూస్. కొద్దిసేపటికి వెస్లీ బయటకు వచ్చి చూస్తే పాప కనిపించలేదు. దాంతో పోలీసులకు ఫిర్యాదు చేసాడు వెస్లీ.
భారత సంతతికి చెందిన ఓ యువకుడు అరుదైన ఘనత సాధించాడు. కేవలం 19 ఏళ్లకే 100 కోట్లు సంపాదించి చూపించాడు . నమ్మసక్యంగా లేదు కదూ..చదవండి మీకే అర్థమౌతుంది...భారతీయ సంతతికి చెందిన అక్షయ్ రూపారెలియా కళాశాల విద్యనభ్యసిస్తున్నాడు. వ్యాపారంలో రాణించాలనే బలమైన కాంక్ష ఉన్న అతను .. బిజినెస్ ప్రారంభించేందుకు బంధువుల నుంచి అప్పుగా 7 వేల డాలర్లు తీసుకున్నాడు. ఈ పెట్టుబడితో స్థిరాస్థి సంస్థ ప్రారంభించాడు. కేవలం ఏడువేల డాలర్లతో వ్యాపారాన్ని ప్రారంభించి..అతను దానిని వందకోట్ల సంస్థగా మార్చాడు. కేవలం 16 నెలల్లోనే తన వ్యాపారాన్ని 12 మిలియన్ పౌండ్ల (103 కోట్ల రూపాయలకు పైగా) కు చేర్చాడు.
పాలు తాగటానికి మారాం చేస్తున్న మూడేళ్ల పాపను ఇంటి బయట వదిలేయగా కనిపించకుండా పోయిన ఘటన టెక్సాస్ లో చోటుచేసుకుంది. అక్టోబర్ 7వ తేదీ అర్థరాత్రి సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు టెక్సాస్ పోలీస్ వర్గాలు తెలిపారు. వారం దాటినా ఇప్పటికీ కుమార్తె ఆచూకీ తెలియలేదని తండ్రి వాపోయారు.
అమెరికాకు చెందిన మధు వల్లి(20) మిస్ ఇండియా వరల్డ్-2017 కిరీటాన్ని దక్కించుకుంది. ప్రపంచంలోని 18 దేశాలకు చెందిన వనితలు పాల్గొన్న ఈ పోటీల్లో మధు వల్లి విజేతగా నిలిచింది. ఆదివారం న్యూజెర్సీలో జరిగిన 26వ ఎడిషన్ అందాల ప్రదర్శనలో ప్రాన్స్ కు చెందిన స్టీఫెన్ మాధవానే రన్నరప్ గా, గయానాకు చెందిన సంగీత బహదూర్ మూడవ స్థానంలో నిలిచింది.
మధు వల్లి హిప్ హాప్ ఆర్టిస్ట్ గా పనిచేస్తూ, వర్జీనియాలోని జార్జ్ మాసన్ యూనివర్సిటీలో క్రిమినల్ లా చదువుతోంది. అందగత్తె కిరీటాన్ని కైవసం చేసుకున్న వల్లి ఆర్టిస్ట్ కావడం ఇష్టమని, భవిష్యత్తులో బాలీవూడ్, హలీవూడ్ చిత్రాలలో నటించాలని ఉందని పేర్కొన్నారు.
అమెరికాలో లెథల్ హెడ్ మరియు గొంతు క్యాన్సర్ చికిత్సకు సంబంధించిన అత్యున్నత పరిశోధనలు చేస్తున్న ఇండో అమెరికన్ వైద్యురాలు నిషా డి సిల్వాకి నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డెంటల్ అండ్ క్రానియో ఫేషియల్ రీసెర్చ్ అనే సంస్థ 8.1 మిలియన్ డాలర్ల గ్రాంటును మంజూరు చేసింది. ప్రస్తుతం నిషా, యూనివర్సిటీ ఆఫ్ మిచిగన్‌లో క్లినికల్ సైంటిస్టుగా పనిచేస్తున్నారు. ఈమెకు సంస్థ పరిశోధనల నిమిత్తం 8 సంవత్సరాలు గ్రాంటు మంజూరు చేయడానికి ముందుకొచ్చింది. వైద్యరంగంలో అత్యద్భుతమైన రీతిలో పరిశోధనలు చేసే శాస్త్రవేత్తలు, వైద్యునిపుణులకు ప్రతీ సంవత్సరం అందించే ఈ గ్రాంటు ఈ
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.