NRI News

19 ఏళ్లకే 100 కోట్లు సంపాదించిన ఘనుడు

19 ఏళ్లకే 100 కోట్లు సంపాదించిన ఘనుడు

భారత సంతతికి చెందిన ఓ యువకుడు అరుదైన  ఘనత సాధించాడు. కేవలం 19 ఏళ్లకే 100 కోట్లు సంపాదించి చూపించాడు . నమ్మసక్యంగా లేదు కదూ..చదవండి మీకే అర్థమౌతుంది...భారతీయ సంతతికి చెందిన అక్షయ్‌ రూపారెలియా కళాశాల విద్యనభ్యసిస్తున్నాడు. వ్యాపారంలో రాణించాలనే బలమైన కాంక్ష  ఉన్న అతను .. బిజినెస్ ప్రారంభించేందుకు బంధువుల నుంచి అప్పుగా  7 వేల డాలర్లు తీసుకున్నాడు. ఈ పెట్టుబడితో స్థిరాస్థి సంస్థ ప్రారంభించాడు. కేవలం ఏడువేల డాలర్లతో వ్యాపారాన్ని ప్రారంభించి..అతను దానిని వందకోట్ల సంస్థగా మార్చాడు. కేవలం 16 నెలల్లోనే తన వ్యాపారాన్ని 12 మిలియన్‌ పౌండ్ల (103 కోట్ల రూపాయలకు పైగా) కు చేర్చాడు.

Oct 17, 2017, 12:16 PM IST
ఆ చిన్నారి ఆచూకీ వెతుకుతూనే ఉన్నారు

ఆ చిన్నారి ఆచూకీ వెతుకుతూనే ఉన్నారు

పాలు తాగటానికి మారాం చేస్తున్న మూడేళ్ల పాపను ఇంటి బయట వదిలేయగా కనిపించకుండా పోయిన ఘటన టెక్సాస్ లో  చోటుచేసుకుంది. అక్టోబర్ 7వ తేదీ అర్థరాత్రి సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు టెక్సాస్ పోలీస్ వర్గాలు తెలిపారు. వారం దాటినా  ఇప్పటికీ కుమార్తె ఆచూకీ తెలియలేదని తండ్రి వాపోయారు. 

Oct 16, 2017, 04:34 PM IST
మిస్ ఇండియా వరల్డ్ విజేత మధు వల్లి

మిస్ ఇండియా వరల్డ్ విజేత మధు వల్లి

అమెరికాకు చెందిన మధు వల్లి(20) మిస్ ఇండియా వరల్డ్-2017 కిరీటాన్ని దక్కించుకుంది. ప్రపంచంలోని 18 దేశాలకు చెందిన వనితలు పాల్గొన్న ఈ పోటీల్లో మధు వల్లి విజేతగా నిలిచింది. ఆదివారం న్యూజెర్సీలో జరిగిన 26వ ఎడిషన్ అందాల ప్రదర్శనలో ప్రాన్స్ కు చెందిన స్టీఫెన్ మాధవానే రన్నరప్ గా, గయానాకు చెందిన సంగీత బహదూర్ మూడవ స్థానంలో నిలిచింది.  మధు వల్లి హిప్ హాప్ ఆర్టిస్ట్ గా పనిచేస్తూ, వర్జీనియాలోని జార్జ్ మాసన్ యూనివర్సిటీలో క్రిమినల్ లా చదువుతోంది. అందగత్తె కిరీటాన్ని కైవసం చేసుకున్న వల్లి ఆర్టిస్ట్ కావడం ఇష్టమని, భవిష్యత్తులో బాలీవూడ్, హలీవూడ్ చిత్రాలలో నటించాలని ఉందని పేర్కొన్నారు. 

Oct 11, 2017, 12:47 PM IST
భారతీయ సంతతి వైద్యురాలికి భారీ గ్రాంట్

భారతీయ సంతతి వైద్యురాలికి భారీ గ్రాంట్

అమెరికాలో లెథల్ హెడ్ మరియు గొంతు క్యాన్సర్ చికిత్సకు సంబంధించిన అత్యున్నత పరిశోధనలు చేస్తున్న ఇండో అమెరికన్ వైద్యురాలు నిషా డి సిల్వాకి నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డెంటల్ అండ్ క్రానియో ఫేషియల్ రీసెర్చ్ అనే సంస్థ 8.1 మిలియన్ డాలర్ల గ్రాంటును మంజూరు చేసింది. ప్రస్తుతం నిషా, యూనివర్సిటీ ఆఫ్ మిచిగన్‌లో క్లినికల్ సైంటిస్టుగా పనిచేస్తున్నారు. ఈమెకు సంస్థ పరిశోధనల నిమిత్తం 8 సంవత్సరాలు గ్రాంటు మంజూరు చేయడానికి ముందుకొచ్చింది. వైద్యరంగంలో అత్యద్భుతమైన రీతిలో పరిశోధనలు చేసే శాస్త్రవేత్తలు, వైద్యునిపుణులకు  ప్రతీ సంవత్సరం అందించే ఈ గ్రాంటు ఈ 

Oct 7, 2017, 07:27 PM IST
అమెరికాకి మరో హరికేన్ "మారియా"

అమెరికాకి మరో హరికేన్ "మారియా"

అమెరికా పౌరులను మరో హరికేన్ భయభ్రాంతులకు గురిచేస్తోంది. ఇప్పటికే హార్వే, ఇర్వా తుఫాన్ల వలన అతలాకుతలమైన పలు అమెరికా ప్రాంతాలు ఇప్పుడు మరో హరికేన్ ప్రభావానికి లోను కానున్నాయి. ఇర్మా హరికేను వల్ల ఇప్పటికే నష్టాన్ని చవిచూసిన కరిబీయన్ దీవులను "మారియా" హరికేన్ తాకనుంది. దీని తాకిడి అప్పుడే 175 కిలోమీటర్ల వేగంతో మొదలై ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. త్వరలో ఈ హరికేన్ తీవ్రతరం అయ్యే అవకాశం ఉందని అమెరికా నేషనల్ హరికేన్ సెంటర్ ప్రకటించింది. 

Sep 19, 2017, 06:23 PM IST
అమెరికాలో తెలుగు వైద్యుడి దారుణ హత్య

అమెరికాలో తెలుగు వైద్యుడి దారుణ హత్య

అమెరికాలో తెలుగు వైద్యుడు దారుణ హత్యకు గురయ్యాడు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన ఎన్నారై మానసిక వైద్య నిపుణుడు నాగిరెడ్డి అచ్యుత్‌రెడ్డిని కొందరు గుర్తుతెలియని వ్యక్తులు కత్తితో పొడిచి చంపారు. కాన్సాస్ లోని ఎడ్జ్‌మూర్‌లో క్లినిక్‌ దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. ఆయ‌న‌ మృతదేహాన్ని పార్కింగ్‌ వెనక భాగంలో పోలీసులు గుర్తించారు. భారత కాలమానం ప్రకారం గురువారం తెల్లవారుజామున ఈ దారుణం జరిగింది. అచ్యుత్‌రెడ్డి వద్ద చికిత్స పొందుతున్న ఉమర్‌ రషీద్‌ అనే రోగి ఈ హత్యకు పాల్పడ్డట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అతను పోలీసుల అదుపులో ఉన్నాడు.

Sep 15, 2017, 11:49 AM IST
సౌదీలో రోడ్డున పడ్డ తెలుగు కార్మికులు

సౌదీలో రోడ్డున పడ్డ తెలుగు కార్మికులు

పొట్టకూటి కోసం సౌదీ వెళ్లిన భారతీయ కార్మికులు రోడ్డున పడ్డారు. వేల మంది ఉద్యోగాలు కోల్పోయి దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఉద్యోగాలు కోల్పోయిన వారిలో తెలుగు కార్మికులు 80 వేల మంది ఉన్నట్లు సమాచారం. సౌదీ దేశ చట్టాల ప్రకారం కంపెనీలన్నీ విదేశీ కార్మికుల భారీ తగ్గించుకున్నాయి. ఈ పక్రియలో భాగంగా 14 శాతం విదేశీ ఉద్యోగులకు తొలగించారు. మరోవైపు ఉద్యోగాలు కోల్పోయిన వారు ఎలాగో అలా స్వదేశాలకు చేరుకుందామనుకుంటే ..కంపెనీ యాజమాన్యాలు పాస్ పోర్టులు, వీసాలు ఇవ్వకుండా తాత్సారం చేస్తున్నాయి. ఇప్పటికే పలు కంపెనీలు విదేశీ కార్మికులకు 3 నెలల నుంచి జీతాలు చెల్లించడం లేదు.

Sep 11, 2017, 01:47 PM IST
సత్య నాదెండ్ల రచయిత అవతారం...

సత్య నాదెండ్ల రచయిత అవతారం...

మన తెలుగు తేజం, మైక్రో సాఫ్ట్ సీఈవో సత్యనాదెండ్ల రచయిత అవతారం ఎత్తబోతున్నాయి. ఈ మాట వింటుంటే ఆశ్చర్యమేస్తోంది కదూ...? ఇది ముమ్మాటికి నిజమండి... వివరాల్లోకి వెళ్లినట్లయితే మీకే అర్థమౌతుంది. ' హిట్ రిఫ్రెస్ ' పేరిట మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెండ్ల పుస్తకాన్ని రాస్తున్నారు.  ఈ నెల 26వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఈ పుస్తకం విడుదల కానుంది. ఈ విషయాన్ని సత్యనాదెండ్ల స్వయంగా తన లింక్డ్ఇన్ లో పోస్టు చేశారు.  ' హిట్ రిఫ్రెస్ 'లో ఏముంది..?

Sep 8, 2017, 04:57 PM IST
డీఏసీఏ రద్దుతో భారతీయుల్లో అభద్రత

డీఏసీఏ రద్దుతో భారతీయుల్లో అభద్రత

అమెరికాలో డీఏసీఏ స్కీం రద్దు చేస్తూ ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో ఆ దేశంలో నివసిస్తున్న భారతీయుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. డీఏసీఏ స్కీం రద్దు వల్ల నష్టపోతారని భావిస్తున్న 8 లక్షల డ్రీమర్లలో భారతీయులు సైతం అధికంగా ఉన్నారని తేలింది. భారత దేశం నుంచి చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు అమెరికా వెళ్లి అక్కడే పెరిగిన భారతీయులు సంఖ్య 20 వేల మంది వరకు ఉంటారని సౌత్ ఏషియన్ అమెరికన్స్ లీడింగ్ టుగెదర్ (సాల్ట్) లెక్కకడుతోంది.

Sep 8, 2017, 12:15 PM IST
వలసలపై ట్రంప్ ఉక్కుపాదం; డ్రీమర్స్ పథకం రద్దు

వలసలపై ట్రంప్ ఉక్కుపాదం; డ్రీమర్స్ పథకం రద్దు

డ్రీమర్స్ పథకాన్ని రద్దు చేస్తూ ట్రంప్ ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది. పిల్లలుగా ఉన్నప్పుడే అమెరికాకు అక్రమంగా వలస వచ్చిన వారు తిరిగి స్వదేశానికి వెళ్లకుండా రక్షణ కల్పించే చట్టం డిఫర్ట్ యాక్షన్ ఫర్ చైల్డ్ హుడ్ ఎరైవల్స్ (డిఎసిఎ) పథకం మునపటి అధ్యక్షుడు ఒబామా ప్రవేశపెట్టారు. ఈ పథకం ద్వారా డ్రీమర్స్‌కు కార్మిక అనుమతులు జారీ చేసేందుకూ వీలుకల్గింది. తాజా ఉత్తర్వులతో బాల్యంలో వలస వాదులను అమెరికాలో స్థిరపడ్డ వారికి ఎలాంటి రక్షణ ఉండబోదు. టెక్సాస్ నేతత్వంలో దాదాపు 9 రిపబ్లిక్ రాష్ట్రాల అటార్ని జనరల్స్ వత్తిడి మేరకు ట్రంప్ ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు సమాచారం.

Sep 7, 2017, 06:50 PM IST
t>