Amazing Video: నీటిలో పడిన ఫోన్ తెచ్చి ఇచ్చిన వేల్

సోషల్ మీడియాలో (Social Media ) నిత్యం ఏదో ఒక అద్భుతమైన వీడియో లేదా ఫోటో షేర్ అవుతూ ఉంటుంది. 

Last Updated : Aug 30, 2020, 08:51 PM IST
    • సోషల్ మీడియాలో (Social Media ) నిత్యం ఏదో ఒక అద్భుతమైన వీడియో లేదా ఫోటో షేర్ అవుతూ ఉంటుంది.
    • దాన్ని చూస్తే ఈ ప్రపంచం ఎంత వింతది.. ఎన్ని రంగులు ఉన్నాయో కదా అని అనిపిస్తుంది.
Amazing Video: నీటిలో పడిన ఫోన్ తెచ్చి ఇచ్చిన వేల్

సోషల్ మీడియాలో ( Social Media ) నిత్యం ఏదో ఒక అద్భుతమైన వీడియో లేదా ఫోటో షేర్ అవుతూ ఉంటుంది. దాన్ని చూస్తే ఈ ప్రపంచం ఎంత వింతది.. ఎన్ని రంగులు ఉన్నాయో కదా అని అనిపిస్తుంది. అలాంటి ఒక వీడియో ( Viral Video ) ప్రస్తుతం వివిధ ప్రచార సాధనాల్లో చెలామణి అవుతోంది.

ఇందులో కొంత మంది వ్యక్తులు ఒక బోటు పై ఉంటూ.. నీటిలో ఉన్న తిమింగళం ఫోటోలు తీయడానికి ప్రయత్నిస్తుంటారు. ఆ తిమింగళం కూడా నా ఫోటోలు తీస్తున్నారు కదూ.. ఉండండి మంచి ఫోజులిస్తాను అని వారిచుట్టే తిరుగుతూ ఉంటుంది.

అయితే ఇలా ఫోటోలు తీస్తున్న క్రమంలో ఒక వ్యక్తి చేతిలో ఉన్న ఫోను నీటిలో పడుతుంది. దీంతో చేసేది ఏమీలేక ఇక ఫోను మర్చిపోవాల్సిందే అని అనుకుంటున్న తరుణంలో బెలుగ వేల్ ( Beluga  Whale) అతని దగ్గరికి వస్తుంది. నీటిలోకి వెళ్లి ఫోన్ తీసుకుని ఫోన్ తో తిరిగి వస్తుంది. అతనికి ఇస్తుంది. ఈ వీడియోను చూసి వేల్ మనసు వెన్న అంటున్నారు నెటిజెన్స్ ( Netizens ).
 

Trending News