Viral Video: ఆ షాప్ లో సైకిల్ తొక్కితేనే జ్యూస్ వస్తుంది, వీడియో వైరల్

Variety Juice Shop: మనం ఆ జ్యూస్ షాప్ లో జ్యూస్ తాగాలంటే ఖచ్చితంగా వ్యాయామం చేయాల్సిందే. ఆ వెరైటీ  జ్యూస్ షాప్ ఎక్కడుందంటే...!  

Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 27, 2021, 08:23 PM IST
Viral Video: ఆ షాప్ లో సైకిల్ తొక్కితేనే జ్యూస్ వస్తుంది, వీడియో వైరల్

Variety Juice Shop: మనం ఆరోగ్యంగా ఉండాలంటే ప్రూట్ జ్యూస్ తాగమంటారు ఆరోగ్య నిపుణలు. నేరుగా జ్యూస్ మాత్రమే తాగితే ఏం లాభం ఉండదు. బాగా వర్కౌట్లు, వ్యాయామాలు చేసి... అప్పుడు జ్యూస్ లు తాగితే హెల్త్ కు మంచిది.  సాధారణంగా ఫ్రూట్ జ్యూస్ కావాలంటే షాప్ (Juice Shop) కి వెళ్తాం. అక్కడ మెనూ చూసి నచ్చిన జ్యూస్ ఆర్డర్ చేస్తాం. వెంటనే షాప్ వాడు క్షణాల్లో మనముందు ఉంచుతాడు. అయితే అహ్మదాబాద్ లో ఉన్న ఈ షాప్ లో జ్యూస్ (Juice) తాగాలంటే మాత్రం మీరు ఖచ్చితంగా వ్యాయామం చేయాల్సిందే.

వివరాల్లోకి వెళితే..
గుజరాత్ అహ్మదాబాద్ (Ahmedabad) లోని 'గ్రీనోబార్' (Greenobar) అనే జ్యూస్ షాప్ ఉంది. ఇక్కడ ఎవరైనా జ్యూస్ తాగాలంటే..ఎవరి జ్యూస్ వారు తయారుచేసుకోవాల్సిందే. దానికి ఇక్కడ ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. ఇక్కడకు వచ్చే వినియోగదారులు తమకు కావాల్సిన జ్యూస్ ఆర్డర్ చేయగానే, అందుకు సంబందించిన ఫ్రూట్స్, ఇతర పదార్ధాలు మిక్సీలో వేసి వెళ్ళిపోతారు సహాయకులు. సైకిల్ పెడల్ కు మిక్సీ అమర్చి ఉంటుంది. సైకిల్ తొక్కడంతోనే అది తిరుగుతుంది. దీంతో కస్టమర్లే ఆ సైకిల్ ఎక్కి తొక్కుకుని కావాల్సినంత జ్యూస్ (cycle and make juice) పిండుకుని తాగుతారు. ఇది అటు వ్యాయామంగాను, ఇటు ఉపయోగంగాను ఉండడంతో వినియోగదారులు ఇక్కడకు వచ్చేందుకు క్యూ కడుతున్నారు. ఈ దుకాణం జీరో వేస్ట్ పాలసీని (zero waste policy) అవలంభిస్తోంది. 

 
 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Greenobar (@thegreenobar)

Also Read: Dual mode vehicle: ప్రపంచంలోనే తొలి రైల్ కం బస్...ఎక్కడో తెలుసా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook 

 

 

 

Trending News