Dog Gets Locked Inside Toilet With A Leopard In Karnataka: సాధారణంగా క్రూర జంతువులకు ఇతర ప్రాణులు ఏం కనిపించినా వాటిని వేటాడి వెంటాడి భక్షిస్తాయి. అయితే కర్ణాటకలో విచిత్రం చోటుచేసుకుంది. ఒకే గదిలో ఉన్నప్పటికీ ఓ చిరుతపులి సహజధోరణికి భిన్నంగా వ్యవహరించింది. ఆ చిరుతకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.
కర్ణాటకలోని బిలినెలె గ్రామంలో ఓ టాయ్‌లెట్‌లో కుక్క, చిరుత కనిపించాయి. వెంటనే ఓ మహిళ బయటనుంచి టాయ్‌లెట్ డోర్ లాక్ చేసింది. దాదాపు 7 గంటలపాటు అవి అందులోనే ఉండిపోయాయి. దీనిపై ఐఎఫ్ఎస్ అధికారి ప్రవీణ్ కాశ్వాన్ ట్వీట్ చేశారు. ప్రతి కుక్కకు ఓ రోజు వస్తుంది. ఓ టాయ్‌లెట్‌లో చిరుతపులి(Leopard)తో పాటు కుక్క గంటల తరబడి అలాగే ఉండిపోయింది. ప్రాణాలతో బయటపడింది. ఇది కేవలం భారత్(India)లో సాధ్యమని పోస్ట్ చేశారు.
Also Read: Ujjwala Yojana: Free LPG కనెక్షన్, రూ.1600 రావాలంటే PMUY వివరాలు తెలుసుకోండి
ఈ ఫొటో చూసి వెంటనే నెటిజన్లు సోషల్ మీడియా(Social Media)లో తమ చేతికి పని చెప్పారు. ఇంత శాంతియుతంగా వ్యవహరించిన చిరుతపులికి నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని కామెంట్లు చేస్తున్నారు. మరికొందరైతే కరోనా సమయం కదా, సోషల్ డిస్టాన్సింక్ బాగా పాటించాయని అభినందిస్తున్నారు.
Also Read: Gold Price Today 04 February: మళ్లీ పతనమైన Gold Price, క్షీణించిన Silver Rate
Every dog has a day. Imagine this dog got stuck in a toilet with a leopard for hours. And got out alive. It happens only in India. Via @prajwalmanipal pic.twitter.com/uWf1iIrlGZ
— Parveen Kaswan, IFS (@ParveenKaswan) February 3, 2021
మరికొందరు నెటిజన్లు కుక్క ధైర్యాన్ని మెచ్చుకుంటున్నారు. తన తప్పు లేకున్నా, చావుకు సిద్ధం చేసిన కుక్క ఎంతో తెగువ చూపించంటూ ఛలోక్తులు విసురుతున్నారు. నెటిజన్లు చేసిన మరికొన్ని కామెంట్లు ఇక్కడ మీకు అందిస్తున్నాం.
Also Read: Today Horoscope, 04 February 2021: నేటి రాశి ఫలాలు ఫిబ్రవరి 4, 2021 Rasi Phalalu
This dog is the bravest one here. It may have had his day but imagine being locked up with death for no fault of his own.
— Urban Roy (@UrbanLab_PvtLtd) February 3, 2021
Social Distancing !!
— ಸುಬ್ರಹ್ಮಣ್ಯ(Subramanya) (@SubramanyaBB) February 3, 2021
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook