Humanity: పాపం పిల్లి..వాటర్ టిన్ లో ఇరుక్కుపోయింది..తరువాత ఏం జరిగిందంటే..

ఈ ప్రపంచంలో మూగజీవాలకు ( Animals ) ఉన్న సమస్యలు, కష్టాలు ఎవరికీ ఉండవు. పొట్ట నింపుకోవడానికి అవి చాలా కష్టపడతాయి. 

Last Updated : Sep 7, 2020, 08:25 PM IST
    • ఈ ప్రపంచంలో మూగజీవాలకు ( Animals ) ఉన్న సమస్యలు, కష్టాలు ఎవరికీ ఉండవు. పొట్ట నింపుకోవడానికి అవి చాలా కష్టపడతాయి.
    • రిస్కులు చేస్తాయి. కొన్ని సార్లు అవి అనుకోని ఆపదను కూడా కొనితెచ్చుకుంటాయి.
    • అలాంటి సమయంలో అవి పోరాటం కొనసాగించి మరీ ప్రాణాలు కాపాడుకోవడానికి ప్రయత్నిస్తుంటాయి.
Humanity: పాపం పిల్లి..వాటర్ టిన్ లో ఇరుక్కుపోయింది..తరువాత ఏం జరిగిందంటే..

ఈ ప్రపంచంలో మూగజీవాలకు ( Animals ) ఉన్న సమస్యలు, కష్టాలు ఎవరికీ ఉండవు. పొట్ట నింపుకోవడానికి అవి చాలా కష్టపడతాయి. రిస్కులు చేస్తాయి. కొన్ని సార్లు అవి అనుకోని ఆపదను కూడా కొనితెచ్చుకుంటాయి. అలాంటి సమయంలో అవి పోరాటం కొనసాగించి మరీ ప్రాణాలు కాపాడుకోవడానికి ప్రయత్నిస్తుంటాయి. లేదంటే ప్రాణాలు విడుస్తుంటాయి.

తాజాగా ఇలాగే ఒక పిల్లి ( Cat ) తెలియకుండా ఒక వాటన్ టిన్ ( Water Tin ) లో ఇరుక్కుపోయింది. ఎంత ప్రయత్నించినా అది బయటికి రాలేకపోయింది. దీనికి సంబంధించిన వీడియో ( Trending Video ) సోషల్ మీడియాలో ( Social Media ) బాగా షేర్ అవుతోంది.

ఎంత ప్రయత్నం చేసినా ఆ పిల్లి వాటర్ టిన్ నుంచి బయటికి రాకపోవడంతో సాయం చేయండి అన్నట్టుగా అరిచింది. చుట్టుపక్కల వారు గమనించి వెంటనే ఫైర్ డిపార్ట్ మెంట్  ( Fire Fighters ) అధికారులుకు సహాయం కోసం పిలిచారు.

ఇండోనేషియాలో ( Indonasia ) జరిగిన ఈ ఘటనలో ఫైర్ డిపార్ట్ మెంట్ అధికారులు వెంటనే రంగంలోకి దిగారు. టిన్ నెక్ దగ్గర జాగ్రత్తగా కట్ చేసి పిల్లి ప్రాణాలను కాపాడారు. దీని కోసం వారు దాదాపు 30 నిమిషాలు కష్టపడ్డారు. పిల్లి ప్రాణాలు కాపాడిన ఫైర్ ఫైటర్స్ ను తెగ పొగిడేస్తున్నారు నెటిజెన్స్.

Trending News