Google Pay: గూగుల్ పే మీద ఢిల్లీ హైకోర్టులో కేసు, యూజర్ల భద్రతకు ముప్పుందంటూ వాదన

Google Pay: ప్రముఖ ఆన్‌లైన్ పేమెంట్ యాప్ గూగుల్ పే ఇప్పుడు వివాదంలో చిక్కుకుంది. గూగుల్ పేతో యూజర్ల భద్రతకు ముప్పు ఏర్పడే ప్రమాదముందనే వార్తలు ఆందోళన కల్గిస్తున్నాయి. దీనికి సంబంధించి ఢిల్లీ హైకోర్టులో దాఖలైన పిటీషన్ కలకలం రేపుతోంది.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Sep 16, 2021, 03:42 PM IST
  • గూగుల్ పే చుట్టూ కొత్త వివాదం, ఢిల్లీ హైకోర్టులో పిటీషన్ దాఖలు
  • అనధికారికంగా ఆధార్, బ్యాంకింగ్ వివరాలు సేకరిస్తుందంటునే ఆరోపణలు
  • గూగుల్, ఆర్బీఐకు నోటీసులు పంపించిన ఢిల్లీ హైకోర్టు
Google Pay: గూగుల్ పే మీద ఢిల్లీ హైకోర్టులో కేసు, యూజర్ల భద్రతకు ముప్పుందంటూ వాదన

Google Pay: ప్రముఖ ఆన్‌లైన్ పేమెంట్ యాప్ గూగుల్ పే ఇప్పుడు వివాదంలో చిక్కుకుంది. గూగుల్ పేతో యూజర్ల భద్రతకు ముప్పు ఏర్పడే ప్రమాదముందనే వార్తలు ఆందోళన కల్గిస్తున్నాయి. దీనికి సంబంధించి ఢిల్లీ హైకోర్టులో దాఖలైన పిటీషన్ కలకలం రేపుతోంది.

యూనిఫైడా్ పేమెంట్ ఇంటర్‌ఫేస్‌గా(UPI)ప్రాచుర్యంలో ఉన్న గూగుల్‌కు చెందిన గూగుల్ పే వివాదంలో పడింది. ఏ విధమైన అనుమతుల్లేకుండానే యూజర్ల ఆధార్, బ్యాంకింగ్ సమాచారాన్ని సేకరిస్తోందనే ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఫలితంగా యూజర్ల భద్రతకు ముప్పు వాటిల్లుతోందని..అంతేకాకుండా యూజర్ల డేటాతో గూగుల్ పే(Goolge pay)అవకతవకలకు పాల్పడుతోందని ఓ వ్యక్తి ఢిల్లీ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేయడం కలకలం ఆందోళన కల్గిస్తోంది. నిజంగానే గూగుల్ ప్రొడక్ట్‌తో యూజర్ల భద్రతకు ముప్పు ఏర్పడనుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ పిటీషన్‌పై దర్యాప్తు చేపట్టిన ఢిల్లీ హైకోర్టు(Delhi High Court) యూఐడీఏఐ, ఆర్బీఐలను ప్రశ్నించింది. ఈ ఆరోపణలు ఎంతవరకూ నిజమే చెప్పాలని సూచించింది. ఈ పిటీషన్‌పై నవంబర్ 8లోగా స్పందించాలని గూగుల్ డిజిటల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు నోటీసులు కూడా జారీ చేసింది. గూగుల్ పే టర్మ్స్ కండిషన్స్‌లో బ్యాంక్ అక్కౌంట్ వివరాలతో పాటు ఆధార్ వివరాల్ని సేకరించే నిబంధనలున్నాయని..ఇది అనుమతులకు విరుద్ధం నడుస్తున్న వ్యవహారమని అభిజిత్ మిశ్రా అనే ఓ ఆర్ధిక నిపుణుడు ఢిల్లీ హైకోర్టులో పిటీషన్ వేశాడు. ఒక ప్రైవేటు కంపెనీగా గూగుల్‌కు ఆధార్, బ్యాంకింగ్ సమాచారాన్ని సేకరించడం, యాక్సెస్ పర్మిషన్ వంటి అధికారాలు ఉండవు. మరోవైపు ఆర్బీఐ ఆథరైజేషన్ లేకుండానే లావాదేవీలు నడిపిస్తోందంటూ మరో పిల్ దాఖలు చేశాడు. అయితే ఇది పేమెంట్ సిస్టమ్ ఆపరేటర్ కాదని..థర్డ్ పార్టీ అప్లికేషన్ ప్రొవైడర్ మాత్రమేనని గతంలోనే ఆర్బీఐ, గూగుల్ ఇండియాలు(Google india)కోర్టుకు విన్నవించాయి. ఈ నేపధ్యంలో గూగుల్‌పై నమోదైన ఈ కేసు పర్యవసానం ఎలా ఉంటుందో వేచి చూడాలి.

Also read: Saidabad Raju Case: ఎన్‌కౌంటర్ చేస్తామన్న 1 రోజు తరువాత నిందితుడి మృతదేహం.. రేకెత్తిస్తున్న పలు అనుమానాలు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News