Gujarat man starts donkeys farm and sells milk: మనం చిన్నప్పుడు సరిగ్గా చదువుకోక పోతే, ఇంట్లో వాళ్లు తిడుతుండేవారు. సరిగ్గా చదువుకోక పోతే.. గాడిదలు కాస్తవా.. అంటూ మందలించేవారు. ఇప్పుడైతే కొంత మందికి మాస్టర్ డిగ్రీలు ఉన్న కూడా సరైన ఉద్యోగం దొరక్క ఇబ్బందులు పడుతున్నారు. మరికొందరు నచ్చని ఉద్యోగం చేస్తు జీవితం సాగిస్తున్నారు. ఇక.. కొందరు మాత్రం వెరైటీగా ఆలోచిస్తుంటారు. ఎవరు చేయని పనులను చేయడానికి ఇంట్రెస్ట్ చూయిస్తుంటారు. ఇప్పటిదాక మనం ఆవుపాలు, గేదెపాలు, మేకపాలతో బిజినెస్ చేసే వాళ్లను తరచుగా చూస్తుంటాం. కానీ చాలా అరుదుగా కొందరు గాడిదల బిజినెస్ చేస్తుంటారు. గాడిదల పాలను అమ్ముతు మంచి ప్రాఫిట్స్ గడిస్తున్నాడు. అంతేకాకుండా.. అనేక మందికి ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తున్నాడు.
గుజరాత్‌కు చెందిన ధీరేన్ సోలంకి పటాన్ జిల్లాలోని తన గ్రామంలో 42 గాడిదలతో గాడిద ఫారమ్‌ను ఏర్పాటు చేశాడు. దక్షిణాది రాష్ట్రాల్లోని ఖాతాదారులకు గాడిద పాలను సరఫరా చేయడం ద్వారా నెలకు ₹ 2-3 లక్షలు సంపాదిస్తున్నాడు. సోలంకి మాట్లాడుతూ.. తాను ప్రభుత్వ ఉద్యోగం కోసం చూస్తున్నానని చెప్పాడు. "నాకు కొన్ని ప్రైవేట్ ఉద్యోగాలు దొరికాయని, కానీ జీతం నా కుటుంబ ఖర్చులకు సరిపోయేది కాదని చెప్పుకొచ్చాడు. ఈ సమయంలో, దక్షిణ భారతదేశంలో గాడిద పెంపకం విన్నాడు. దీనిపై కొంతమందిని కలుసుకున్నాను. గాడిదల బిజినెస్ చేస్తే ఎలా ఉంటుందని అందరితో చర్చించాడు.
దాదాపు.. 8 నెలల క్రితం మా గ్రామంలో ఈ వ్యవసాయాన్ని భూమిని లీజ్ కు తీసుకున్నాడు. దీనిలో.. 20 గాడిదలు కొని.. ₹ 22 లక్షల పెట్టుబడితో బిజినెస్ ప్రారంభించాడు. గుజరాత్‌లో గాడిద పాలకు అంతగా గిరాకీ లేదు, సోలంకి మొదటి ఐదు నెలల్లో ఏమీ సంపాదించలేదు. అతను దక్షిణ భారతదేశంలో గాడిద పాలకు డిమాండ్ ఉన్న కంపెనీలను చేరుకోవడం ప్రారంభించాడు. అతను ఇప్పుడు కర్ణాటక, కేరళకు పాలను ప్రతిరోజు సరఫరా చేస్తున్నాడు. ఇతని బిజినెస్ గాడిద ఉత్పత్తులను అనేక కంపెనీలు ఉపయోగించుకుని కాస్మోటిక్ వస్తువులను తయారు చేస్తున్నట్లు తెలిపారు.
గాడిద పాలధర గురించి అడిగినప్పుడు, మిస్టర్ సోలంకి లీటర్ కు.. ₹ 5,000 నుండి ₹ 7,000 మధ్య ఉంటుందని చెప్పారు . దీనిని లీటరు ₹ 65కి విక్రయించే ఆవు పాలతో పోల్చుకొవచ్చన్నాడు. పాలు తాజాగా ఉండేలా ఫ్రీజర్స్‌లో నిల్వ చేయబడతాయి. పాలను ఎండబెట్టి, పొడి రూపంలో కూడా విక్రయిస్తున్నారు. పొడి పాలధర కిలోల ధర సుమారు లక్ష వరకు ఉంది. సోలంకి ఇప్పుడు తన పొలంలో 42 గాడిదలను పెంచుకుంటున్నాడు. ఇప్పటివరకు దాదాపు 38 లక్షల రూపాయల పెట్టుబడి పెట్టాడు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి సహాయం తీసుకోలేదని, అయితే ఈ రంగంపై కూడా దృష్టి పెట్టాలన్నారు.
గాడిద పాలు యొక్క ప్రయోజనాలు
పురాతన కాలంలో గాడిద పాలను విస్తృతంగా ఉపయోగించారు, ఈజిప్టు రాణి క్లియోపాత్రా గాడిద పాలల్లో.. స్నానం చేసేదని కొన్ని కథనాలు పేర్కొంటున్నాయి. గ్రీకు వైద్యుడు హిప్పోక్రేట్స్, ఔషధం యొక్క పితామహుడు, కాలేయ సమస్యలు, ముక్కు కారటం, విషాలు, అంటు వ్యాధులు, జ్వరాలకు గాడిద పాలను సూచించినట్లు తెలిసింది.
US నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్‌లోని ఒక నివేదిక ప్రకారం, ఆవు పాలతో పోలిస్తే గాడిద పాలు మానవ పాలతో సమానంగా పోషక విలువలను ఉంటాయి. శిశువులకు, ముఖ్యంగా ఆవు పాలకు అలెర్జీ ఉన్నవారికి గాడిద పాలు ఎంతో ఉపయోగపడతాయని చెబుతుంటారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter