Haryana man throws a divorce party poses with mannequin of ex wife video: సాధారణంగా పెళ్లి తర్వాత భార్య భర్తల మధ్య గొడవలు జరుగుతుంటాయి.ఇద్దరు పెరిగిన వాతావరణం, అలవాట్లు భిన్నంగా ఉంటాయి. కొన్నిరోజులు ఒకర్ని మరోకరు అర్థం చేసుకునేందుకు సమయం పడుతుంది. కొందరు ఏదైన గొడవలు తలెత్తితే.. మాట్లాడుకుని సాల్వ్ చేసుకుంటారు.
కానీ మరికొందరు మాత్రం దీనికి భిన్నంగా చిటీకి మాటికి పంచాయతీలు, డైవర్స్ అంటూ తమ పరువును బజారుకు ఈడ్చుకుంటారు. కొంత మంది తమ భార్యలు అందంగాలేదని, కూరవండరాలేదని, ఇంట్లో వాళ్లను సరిగ్గా చూసుకొవడం లేదని డైవర్స్ ఇస్తుంటారు. ఇక మహిళలు..తమ భర్త షాపింగ్ లకు తీసుకెళ్లడం లేదని, బాగా చూసుకొవడం లేదని, ఇతరులతో కంపెర్ చేస్తు సాధిస్తుంటారు. దీని వల్ల గొడవలు జరుగుంటాయి.
అవి కాస్త డైవర్స్ వరకు వెళ్తుంటాయి. మరికొందరు పెళ్లాయ్యాక.. వివాహేతర సంబంధాలు పెట్టుకుంటారు. దీని వల్ల కూడా.. డైవర్స్ ఘటనలు జరుగుతుంటాయి. ఈ క్రమంలో ప్రస్తుతం హర్యానాలో జరిగిన ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
పూర్తి వివరాలు..
హర్యానాలోని ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తొంది. 2020లో మంజీత్ అనే వ్యక్తి కోమల్‌ని పెళ్లి చేసుకున్నాడు.పెళ్లి చేసుకున్న కొన్నిరోజులు బాగానే ఉన్నారు. మరీ ఆతర్వాత ఏమైందో కానీ.. ఇద్దరి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. పెద్దలు చెప్పిన కూడా వినలేదు. ఎవరికి వారు... విడిపోదామని నిర్ణయించుకున్నట్లు తెలుస్తొంది. ఈ క్రమంలో ఇటీవల కోర్టు వీరికి డైవర్స్ మంజురు చేసినట్లు తెలుస్తొంది.
అయితే.. అతగాడు..తన మాజీ భార్య దిష్టిబొమ్మను ఏర్పాటు చేసి..విడాకులు పార్టీ ఇచ్చినట్లు తెలుస్తొంది. అంతే కాకుండా.. ఒక ఫ్లెక్సీపైన... విడాకుల పార్టీపై తన వివాహ ఫొటోను ముద్రించాడు. వివాహం, విడాకుల తేదీలను కూడా రాసుకొచ్చినట్లు తెలుస్తొంది.
Read more: Viral Video: క్లాసులో అదిరిపోయే స్టెప్పులు వేసిన టీచర్.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వీడియో ఇదే..
ఫొటో ముందు చాలా కేకులు కూడా కనిపించాయి. వాటిని కట్ చేస్తూ ఆ వ్యక్తి విడాకుల వేడుకలు గ్రాండ్గా చేసుకున్నాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీన్ని చూసిన కొందరు అతడ్ని కామెంట్లు చేస్తుంటే.. మహాతల్లి ఎంత సాధించిదో అని మరికొందరు ఇతనికి అండగా నిలుస్తున్నారు.