Unknown Person Enters Nizampet Apartments Over Murder Threat: కొందరు కేటుగాళ్లు అపార్ట్ మెంట్ లలోకి ప్రవేశించి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా మధ్యాహ్నం పూట.. సెక్యురిటీ గార్డులు లేని అపార్టుమెంట్లను టార్గెట్ గా చేసుకుంటున్నారు. ఒంటరిగా ఎవరైన పెద్దవయస్సుల వారు, మహిళలు కన్పిస్తే దాడులు చేయడానికి సైతంవెనుకాడటం లేదు. ఈ మధ్య కాలంలో మార్కెటింగ్ ప్రోడక్ట్స్ చూపిస్తున్నట్లు, అదే విధంగా.. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చామని ఏవేవో ఐడీ కార్డులు, అచ్చం సినిమాలో చూపించిన విధంగా బూట్లు, టైలు వేసుకుని అమాయకులను మోసం చేస్తున్నారు. ఇంట్లోని వారి వివరాలు అడగి.. నీళ్లవ్వమని చెప్పి.. ఇలా వెనుక నుంచి దాడులకు పాల్పడుతున్నారు. మరికొందరు బంగారానికి మెరుగు పెడుతామంటూ, ఇంట్లో దుష్ట శక్తులను వెళ్లగొడుతామంటూ కూడా అమాయకులను మోసం చేస్తున్నారు. వీరి బుట్టలో పడిని వారిని మత్తుమందు కలిపి ఇచ్చి మోసాలు చేస్తున్నారు.
Dear friends, Please be watchful especially ladies & Seniors staying alone. This incident took place in #Nizampet, #Hyderabad #Telangana pic.twitter.com/hfR3BiwPTS
— Kaza Vk Ramabrahmam (@KazaVk) March 4, 2024
కొందరు ఇంట్లోకి ప్రవేశించి అమాయకుల్లాగా నటిస్తారు. ఆ తర్వాత తమ అసలు నిజస్వరూపం బైటపెడుతుంటారు. ఇలాంటి ఒక షాకింగ్ ఘటన హైదరాబాద్ లోని నిజాంపేటలో జరిగింది. ఇప్పుడిది వైరల్ గా మారింది. ఒక గుర్తుతెలియని నిజాంపేటలో ఉన్న ఒక అపార్ట్ మెంట్ లోకి ప్రవేశించాడు. అప్పుడు ఆ ఇంట్లో మహిళలు మాత్రమే ఉన్నారు. డోర్ ఓపెన్ ఉండటంతో ఏకంగా ఇంట్లోకి ప్రవేశించి డోర్ కూడా పెట్టుకొవడానికి ప్రయత్నించాడు.
ఆ ఇంట్లోకి మహిళ.. ఎవరు నువ్వని గట్టిగా నిలదీస్తుంటే.. నన్ను చంపడానికి వస్తున్నారని, మాట్లాడోద్దని రివర్స్ లో మహిళలను దబాయిస్తున్నాడు. చివరకు మహిళ ధైర్యం చేసుకుని తన ఫోన్ లో వీడియో రికార్డు చేసి, వెళ్లిపోవాలని బెదరించింది. ఆ కేటుగాడు.. ఇంట్లో నుంచి బైటకు వచ్చి సెకండ్ ఫ్లోర్ నుంచి కిందకు దూకేశాడు. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు.
అతను ఎవరో.. ఎందుకోచ్చాడో కూడా తెలియందని మహిళ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు... హైదరాబాద్ లో ఒంటిరిగా ఉన్న మహిళలు,పెద్ద వయస్సు వారు అప్రమత్తంగా ఉండాలని కామెంట్లు పెడుతున్నారు. అతగాడికి అరెస్టు చేయాలంటూ పోలీసులను కోరుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook