Viral Video, Man easily bathed the king cobra with his bare hands: ఈ ప్రపంచంలో రకరకాల జాతులకు చెందిన పాములు ఉన్నాయి. 3000 కంటే ఎక్కువ జాతుల పాములు ఉన్నాయని నివేదికలు చెపుతున్నాయి. అన్నింటిలోకెల్లా 'కింగ్ కోబ్రా' అత్యంత ప్రమాదకరమైనది. కింగ్ కోబ్రా విషం చాలా విషపూరితమైనవి. అది ఒక్కసారి కాటేసిందంటే.. బలమైన ఏనుగు కూడా నిమిషాల్లో చనిపోతుంది. ఇక మనిషి పరిస్థితి ఎలా ఉంటుందో మనం అర్ధం చేసుకోవచ్చు. అందుకే చాలా మంది కింగ్ కోబ్రాకు భయపడతారు. కొందరు అయితే దాని పేరు వింటేనే హడలిపోతారు.
కింగ్ కోబ్రా, త్రాచు పాములతో కూడా ఆడుకునేవారు కూడా ఈ ప్రపంచంలో కొందరు ఉన్నారు. కింగ్ కోబ్రా లాంటి విషపూరిత పాములను పెంచుతూ.. వాటికి స్నానం కూడా చేపిస్తారు. 'చాండ్లర్స్ వైల్డ్ లైఫ్' పేరుతో యూట్యూబ్ పేజీలో పోస్ట్ చేసిన ఓ వీడియో ఓ వ్యక్తి కింగ్ కోబ్రా, త్రాచు పాముకి స్నానం చేయించాడు. 18.53 నిమిషాల నిడివి గల ఈ వీడియోలో ఒక వ్యక్తి కింగ్ కోబ్రా మరియు త్రాచు పాముకి ఒట్టి చేతులతో స్నానం చేయించాడు. ముందుగా కింగ్ కోబ్రాను బయటికి తీసి.. దాన్ని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేసి నీరు ఉన్న ఓ ప్లాస్టిక్ బకెట్లో వేసి మూతపెడతాడు.
ఆపై త్రాచు పామును కూడా ఇంకో ప్లాస్టిక్ బకెట్లో వేసి మూతపెడతాడు. ఓ అరగంట తర్వాత రెండిటిని తీసి అవి ఉండే రాక్ లో విడిపెడతాడు. ఈ వీడియో పాతదే అయినా (జూలై 11, 2019) ఇప్పుడు వైరల్ అవుతోంది. చాండ్లర్స్ వైల్డ్ లైఫ్ పేరుతో యూట్యూబ్ పేజీలో పోస్ట్ చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోకి ఇప్పటివరకు 13,610,261 వ్యూస్ వచ్చాయి. అలాగే 180 వేల మంది వీడియోను లైక్ చేయగా. 28,320 మంది కామెంట్ చేశారు. 'నువ్ సూపర్ బాస్' అంటూ ఒకరు కామెంట్ చేయగా.. 'హ్యాట్సాఫ్ భయ్యో' అంటూ ఇంకొకరు ట్వీట్ చేశారు.
Also Read: Suresh Raina Retires: ఆటకు వీడ్కోలు పలికిన సురేశ్ రైనా.. ఇక చెన్నై టీమ్‌కి కెప్టెన్ పక్కా?
Also Read: చహల్ వద్దు.. అతడేనే తుది జట్టులో ఆడించండి! శ్రీలంకతో మ్యాచ్‌కు ముందు గంభీర్ సలహా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook