Snake Video Viral: వామ్మో.. కుబుసం విడుస్తున్న పాము.. ఎప్పుడైనా చూశారా..?.. ఇదిగో వీడియో మీ కోసం..

Snake viral news: పాము అడవిలో కుబుసం విడుస్తుంది. అయితే అది చాలా కోపంగా ఉన్నట్లు తెలుస్తొంది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ హల్ చల్ చేస్తుంది. కొంత మంది దీన్ని చూసి షాక్ అవుతున్నారు.  

Written by - Inamdar Paresh | Last Updated : Dec 18, 2024, 09:28 AM IST
  • తన తోలు ఒలుచుకుంటున్న పాము..
  • నెట్టింట హల్ చల్ చేస్తున్న వీడియో ఇదే..
Snake Video Viral: వామ్మో.. కుబుసం  విడుస్తున్న పాము.. ఎప్పుడైనా చూశారా..?.. ఇదిగో వీడియో మీ కోసం..

Snake shed his skin video viral: పాముల వీడియోలు సామాజిక మాధ్యమాలలో తరచుగా చక్కర్లు కొడుతుంటాయి. చూసిన వాళ్లకు చూసినంత అన్న విధంగా పాముల వీడియోలు ఇటీవల కాలంలో వార్తలలో ఉంటున్నాయి. నెటిజన్లు కూడా వీటిని ఎగబడి మరీ చూస్తున్నారు. పాముల్ని చూస్తే కొంత మంది భయపడి ఆమడ దూరం పారిపోతుంటారు. మరికొందరు పాముల్నికొట్టడం వంటివి చేస్తుంటారు.

అదే విధంగా పాములు కాటు వేస్తే , వెంటనే సరైన సమయంలో చికిత్స తీసుకుంటే.. ఆపద నుంచి బైటపడొచ్చు. ఏ పాము కాటు వేసిందో గుర్తు పడితే.. పాము కాటుకు మందు ఇవ్వడం తెలిక అవుతుంందంటారు. ఈ నేపథ్యంలో పాములు చాలా అరుదైర సందర్భాలలో కుబుసంను విడుస్తాయంటారు. ప్రస్తుతం ఒక పాము కుబుసం విడుస్తున్న వీడియో నెట్టింట తెగ హల్ చల్ చేస్తుంది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది.

 

సాధారణంగా పాములు ఏడాదికి రెండు నుంచి మూడు సార్లు కుబుసం విడుస్తాయంట. కుబుసం అంటే.. పాములో ఉన్న చర్మంను వదిలించుకుని.. కొత్త చర్మంను ధరిస్తుందంట. అదే విధంగా పాము శరీరంలో రెండు చర్మాలు ఉంటాయంట. అవి తన లోపల చర్మం రెడీ అయిపోయినట్లు తనకు సంకేతంరాగానే.. బైటవైపు ఉన్న చర్మంను ఒలిచేసుకుంటుందంట.

మరికొన్ని సందర్భాలలో బైటి చర్మం మీద ఎక్కువగా పరాన్న జీవులు ఉన్న కూడా పాము వెంటనే తన బైటి చర్మంను వొలిచేస్తుందంట. ఈ వీడియోలో కూడా పాము తన చర్మంను స్పీడ్ గా వొలిచేసుకుంటుంది. ఇది ప్రస్తుతం నెట్టింట హల్ చల్ చేస్తుంది. దీన్ని చూసిన నెటిజన్లు మాత్రం షాక్ అవుతున్నారు. అయితే.. పాము కుబుసం విడుస్తున్నప్పుడు మాత్రం చాలా కోపంగా ఉంటుందంట.

Read more: Snake Viral Video: వావ్.. చమక్.. చమక్ చమ్కాయిస్తున్న డైమండ్ సర్పం.. వీడియో చూస్తే ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే..

ఆసమయంలో పొరపాటున డిస్టర్బ్ చేస్తే కాటేయడానికి, పగబట్టడానికి కూడా వెనుకాడదంట. అందుకే చాలా మంది పాము కుబుసం విడుస్తుందని తెలిస్తే ఆ దరిదాపుల్లోకి కూడా వెళ్లరు. అదే విధంగా పాము కుబుసం విడిచిన తర్వాత కూడా కొన్ని రోజుల  వరకు చాలా కోపంగా ఉంటుందంట. ప్రస్తుతం అయితే.. పాము కుబుసం విడుస్తున్న ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

Trending News