Mother talent goes viral: సాధారణంగా చాలా మంది మగాళ్లు ఏదో ఉద్యోగాలు చేస్తు.. మహిళలు ఇంట్లో ఉంటారు. వారు ఏంచేస్తారని తక్కువ చేసి చూస్తుంటారు. కానీ వారు పిల్లల్ని రెడీ చేయడం , వారికి కావాల్సిన టిఫిన్ లు చేసి పెట్టడం, స్కూల్ కు వెళ్లేటప్పుడు ఏంకావాలో అవన్ని చూసుకుంటారు. అదే విధంగా ప్రస్తుతం మహిళలు ఒకవైపు ఉద్యోగం చేస్తునే.. మరొవైపు తమ పిల్లలకు ఏంకావాలో కూడా చూసుకుంటున్నారు.
చాలా మంది ఇళ్లలో చిన్న పిల్లలు ఉంటే.. ఉదయం పూట ఉండే హడావిడి అంత ఇంత కాదని చెప్పుకొవచ్చు. పిల్లల్ని నిద్రనుంచి లేపడం,వారికి స్కూల్ డ్రెస్ లు వేయడం, స్నాక్స్, మరల బాక్స్ లో ఏదైన లంచ్ పెట్టివ్వడం మొదలైన పనులు చేస్తుంటారు.ఇలా బిజీగా ఉంటారు. అయితే.. కొన్ని సార్లు ఆ తల్లులు కూడా కొన్ని విషయాల్ని మర్చిపోయేందుకు చాన్స్ కూడా ఉంటుంది.
भारतीय मम्मी सबसे ज्यादा जुगाड़ू....🥰🤣🌺❤️ pic.twitter.com/hM7giGv12q
— salony (@_salony05) December 28, 2024
అయితే.. స్కూళ్లకువెళ్లే చిన్న పిల్లలున్నప్పుడు.. వారు యూని ఫామ్, టై, బెల్ట్, షూస్ లు, అన్ని కూడా స్కూళ్ల వారు చూస్తుంటారు. ఏ ఒక్కటి మిస్ అయిన..పెరెంట్స్ లకు క్లాస్ పీకుతుంటారు. అయితే.. ఒక తల్లి తన కొడుకు స్కూల్ కు వేసుకొని వెళ్లే సాక్స్ గురించి మర్చిపోయిందో ఏంటో కానీ..ఆమె భలే ఐడియా వేసింది. ఇంట్లోని మాడిపోయిన కడయ్ తీసుకొచ్చి.. అతని కాళ్లకు సాక్స్ మాదిరిగా రంగుపూసింది.
సాక్స్ లేకుండా.. షూస్ వేసుకుంటే.. స్కూల్ వాళ్లు పనిష్మెంట్ ఇస్తారు. అందుకే ఈ తల్లి ఇలా ఐడియా వేసినట్లు ఉంది. తన కొడుకు కాళ్లకు నల్లని మసిపూసీ అతనికి షూస్ వేసి స్కూళ్ కు పంపించినట్లు తెలుస్తొంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గామారింది.
Read more: Black Leopard Video: వావ్.. అడవిలో పసికూనతో అరుదైన నల్లని చిరుత.. వైరల్‌గా మారిన వీడియో..
దీన్ని చూసిన నెటిజన్లు మాత్రం.. నువ్వు సూపర్ తల్లో.. నీకు అవార్డు ఇవ్వాలే.. అంటూ సదరు మహిళ టాలెంట్ పై ప్రశంసలు కురిపిస్తున్నట్లు తెలుస్తొంది. మొత్తానికి ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter