Black leopard with small cub roaming in odisha: అడవిలో రకరకాల జంతువులు ఉంటాయి. క్రూరజంతువులు, సాధుజంతువులు ఉంటాయి. అయితే.. ఫారెస్ట్ సిబ్బంది అడవలో ఉన్నజంతువులలో అరుదైన జంతువులు ఉంటాయి. అటవీ శాఖ అధికారులు ఎక్కడికక్కడ ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేసి..ఎక్కడ కూడా దొంగ చాటున అడవిలోని సంపద తరలిపొకుండా.. గస్తీ కాస్తుంటారు.
కొందరు ముఠాలుగా ఏర్పడి జంతువులను, గంధపు చెట్లు, టేకు చెట్లను దొంగచాటున తీసుకెళ్తుంటారు. అయితే.. వీరిని ఫారెస్ట్ సిబ్బంది ఎప్పటికప్పుడు కనిపెట్టుకుని ఉంటారు. ఈ క్రమంలో కొన్నిసార్లు ట్రాప్ కెమెరాలలో అరుదైన చిత్రాలు రికార్డు అవుతుంటాయి.
#WATCH नयागढ़, ओडिशा: ओडिशा के नयागढ़ जंगल में दुर्लभ मेलानिस्टिक तेंदुआ अपने शावक के साथ देखा गया।
(वीडियो सोर्स: DFO) pic.twitter.com/gKzmkcAUnO
— ANI_HindiNews (@AHindinews) January 3, 2025
ఈ క్రమంలో ప్రస్తుతం ఒడిశాలోని నయాగఢ్ జిల్లాలోని అడవిలో ఇలాంటి ఒక ఘటన రికార్డు అయ్యింది. దీన్ని స్థానిక ఫారెస్ట్ అధికారి..ప్రేమ్ కుమార్ తన ఇన్ స్టాలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్ గా మారింది.
పూర్తివివరాలు..
ఒడిశాలోని నయాగఢ్ జిల్లాలో దట్టమైన అడవి కొన్ని కిలోమీటల్ల పరిధిలో విస్తరించింది. దీనిలో అనేక జంతువులు ఉన్నాయి. అయితే.. ఇటీవల ఒక ట్రాప్ కెమెరాలో.. నల్లని చిరుత.. తన నోట్లో ఒక పసికూనను పట్టుకుని వెళ్లడం రికార్డు అయ్యింది.
సాధారణంగా చిరుతలు నల్లగా ఉండవు.అయితే... ఇక్కడ మాత్రం.. చిరుత నల్లగాఉండటం మాత్రం కాస్త ఆశ్చర్యకంగా మారిందని చెప్పుకొవచ్చు. ప్రస్తుతం ఈ వీడియోను ఫారెస్ట్ అధికారి ప్రేమ్ కుమార్ తన ఇన్ స్టాలో పోస్ట్ చేశారు.దీంతో ఇది కాస్త వైరల్ గా మారింది.
దీన్ని చూసిన నెటిజన్ లు మాత్రం.. అరే.. చిరుతేంటీ.. ఇలా ఉందని కూడా షాక్ అవుతున్నారంట. మరికొందరు కొన్నిసార్లు జన్యుపరమైన లోపం కారణంగా ఇలా జరిగి ఉండొచ్చని కూడా అంటున్నారంట. ఏదీ ఏమైన ప్రస్తుతం నల్లని చిరుత వీడియో మాత్రం నెట్టింట హల్ చల్ చేస్తుందని చెప్పుకొవచ్చు...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter