OnePlus Nord 2 5G phone blasted: వన్‌ప్లస్ నాడ్ 2 5G ఫోన్ మార్కెట్లోకి లాంచ్ అయి కేవలం ఐదు రోజులే అవుతోంది. జులై 28నే వన్‌ప్లస్ నాడ్ 2 ఫోన్ అందుబాటులోకి వచ్చింది. ఇంతలోనే బెంగళూరు నుంచి అంకుర్ శర్మ అనే ఓ వ్యక్తి తన భార్య వినియోగిస్తున్న వన్‌ప్లస్ నాడ్ 2 5G ఫోన్ స్లింగ్ బ్యాగ్‌లో ఉండగా పేలిందంటూ ట్విటర్లో ఓ పోస్ట్ పెట్టాడు. గతంలో అనేకసార్లు ఫోన్లు చార్జింగ్ పెడుతుండగా పేలిన సందర్భాలున్నాయి. అయితే, ఈసారి ఈ ఘటనలో ఆమె బైక్‌పై వెళ్తుండగా బ్యాగులో ఉన్న ఫోన్ పేలింది. అనుకోని పరిణామంతో తన భార్య బైక్ బ్యాలెన్స్ అదుపు తప్పి ప్రమాదానికి గురైనట్టు అంకుర్ శర్మ తెలిపాడు.
వన్‌ప్లస్ నాడ్ 2 5G ఫోన్ పేలింది అనే ట్వీట్ కొన్ని క్షణాల్లోనే వైరల్‌గా మారింది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే స్మార్ట్ ఫోన్ యూజర్స్ (Smartphone users) ఈ ఘటనపై స్పందించడంతో సోషల్ మీడియాలో ఈ అంశంపై పెద్ద చర్చే జరిగింది. దీంతో వన్ ప్లస్ కంపెనీకి సైతం ఈ ఉదంతంపై స్పందించక తప్పలేదు. ఈ ఘటనపై ఆరా తీస్తున్నామని ట్విటర్లోనే ఓ పోస్ట్ పెట్టిన వన్ ప్లస్ కంపెనీ... అంకుర్‌ని డైరెక్ట్ మెసేజ్ ద్వారా తమతో టచ్‌లోకి రావాల్సిందిగా కోరింది.
Hi Ankur. We are gutted to hear about your experience. We are deeply concerned and want to make it up to you. We request you to connect to us over a direct message so that we can make amends and turn this around for you. https://t.co/Y6rHuMwu8J
— OnePlus Support (@OnePlus_Support) August 1, 2021
Also read : వాట్సాప్ ఫీచర్స్‌తో సందేశ్ యాప్ లాంచ్ చేసిన కేంద్రం
విచిత్రం ఏంటంటే.. వన్ ప్లస్ స్పందించిన అనంతరం అంకుర్ శర్మ తన ట్వీట్‌ని డిలీట్ చేశాడు. ఏదేమైనా ఈ ఘటనతో వన్‌ప్లస్ నాడ్ 2 5G స్మార్ట్ ఫోన్ (OnePlus Nord 2 5G phone) అంత సేఫ్ కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ డ్యామేజీ నుంచి వన్ ప్లస్ కంపెనీ ఎలా బయటపడుతుందో చూడాలని నెటిజెన్స్ చర్చించుకుంటున్నారు.
Also read : Aadhaar Card: ఆధార్ అప్డేషన్లో కొత్త సౌలభ్యం, ఫోటో మార్చడం ఎలా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook