Wierd News: శానిటైజర్ రాసుకుని బంగారం ఎత్తుకెళ్లిన దొంగలు..

భారత్ లో కరోనావైరస్ ( Coronavirus ) సంక్రమణ వేగంగా పెరుగుతోండటంతో చిన్నా పెద్దా అని తేడాలు లేకుండా అందరూ మాస్కులు ధరిస్తున్నారు.

Last Updated : Sep 12, 2020, 05:14 PM IST
    • భారత్ లో కరోనావైరస్ ( Coronavirus ) సంక్రమణ వేగంగా పెరుగుతోండటంతో చిన్నా పెద్దా అని తేడాలు లేకుండా అందరూ మాస్కులు ధరిస్తున్నారు.
    • శానిటైజర్ వాడుతున్నారు. దీనికి క్రిమినల్స్ కూడా మినహాయింపు కాదు.
Wierd News: శానిటైజర్ రాసుకుని బంగారం ఎత్తుకెళ్లిన దొంగలు..

భారత్ లో కరోనావైరస్ ( Coronavirus ) సంక్రమణ వేగంగా పెరుగుతోండటంతో చిన్నా పెద్దా అని తేడాలు లేకుండా అందరూ మాస్కులు ధరిస్తున్నారు. శానిటైజర్ వాడుతున్నారు. దీనికి క్రిమినల్స్ కూడా మినహాయింపు కాదు. పైగా నేరం చేసే ముందు కోవిడ్-19 ( Covid-19 ) నియమాలు తూచతప్పకుండా పాటిస్తున్నారు. ఇదంత చెప్పడానికి కారణం యూపీలోని అలీగఢ్ లో జరిగిన ఒక దొంగతనమే.

అలీగఢ్ కు చెందిన ఒక దొంగతనం వీడియో ( Viral Video ) ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఇందులో దొంగలు మాస్కు వేసుకుని ఒక బంగారం షాపులోకి ప్రవేశిస్తారు.

వారు ఇలా షాపులోకి ప్రవేశించిన వెంటనే కౌంటర్ పై కూర్చున్న ఒక వ్యక్తి వెంటనే వారికి లిక్విడ్ శానిటైజర్ ఇస్తాడు. వారు వెంటనే వాటితో చేతులు  శుభ్రపరుచుకుని.. టీ షర్టు వెనక ఉన్న తుపాకీ తీసి వారికి చూపిస్తాడు. అది చూసి బెదిరిపోయిన షాపు సిబ్బంది సైలైంట్ అయిపోతారు. ఈ దొంగలు తము వచ్చిన పని కానిస్తూ చేతికి చిక్కిన ప్రతీ విలువైన ఆభరణాన్ని బ్యాగులో ప్యాక్ చేసుకుని వెళ్లిపోతారు.

ఈ వీడియోపై సోషల్ మీడియాలో ( Social Media ) చాలా ఫన్నీ కామెంట్స్ వస్తున్నాయి. ఈ దొంగలు కోవిడ్-19 రూల్స్ అన్నీ పాటించారు అని కామెంట్ చేస్తున్నారు కొందరు.

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x