snake bites to snake rescueman in Maharashtra: పాములు చాలా డెంజర్ అని చాలా మంది చెప్తుంటారు. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్న సరే.. నిముషాల్లో ప్రాణాలు గాల్లో కలిసి పోతాయి. కొందరు పాములు కన్పించగానే స్నేక్ రెస్క్యూటీమ్ కు సమాచారం ఇస్తారు. అంతేకాకుండా..పాములకు ఎట్టి పరిస్థితుల్లోకూడా ఆపద కల్గించరు. కానీ కొన్నిసార్లు పాములను పట్టుకునే క్రమంలో అనుకోని ఘటనలు చోటు చేసుకుంటాయి. పాములకు సంబంధించిన వీడియోలు తరచుగా వార్తలలో ఉంటాయి. నెటిజన్లు కూడా వీటిని చూడటానికి ఆసక్తిని చూపిస్తుంటారు. కొన్నిరకాల వీడియోలు చూస్తే షాకింగ్ కు గురిచేసేవిలాగా ఉంటాయి. మరికొన్ని పాముల వీడియోలు ఆశ్చర్యానికి గురిచేసేవిలా ఉంటాయి.
ఈ క్రమంలో.. చెట్లు, కొండ ప్రాంతాలు, గుబురుగా ఉంటే పొదల్లో పాములు ఎక్కువగా ఆవాసం చేస్తాయి. పొలాల్లొ కూడా పాములుఎక్కువగా సంచరిస్తుంటాయి. బియ్యం, వడ్లు తినడానికి పాములు వస్తుంటాయి. పాముల కోసం ఎలుకలు వస్తాయి. ఇదిలా ఉండగా.. పాములకు చెందని వెరైటీ ఘటనలు ఎక్కువగా వార్తలలో ఉంటాయి. నెటిజన్లు కూడా పాములకు సంబంధించిన వెరైటీ వీడియోలను చూడటానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ప్రస్తుతం మహారాష్ట్రలో పాముకాటుకు చెందిన ఒక వీడియో సామాజిక మాధ్యమంలో వైరల్ గా మారింది.
పూర్తి వివరాలు..
మహారాష్ట్ర గోండియా జిల్లా ఫుల్చూర్‌లో ఈ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా ఉండే.. సునీల్ (44) అనే వ్యక్తి పాములు పట్టుకుని వాటిని ఇతర చోట్ల వదిలేస్తుంటాడు. కొన్నేళ్లుగా ఇతను స్నేక్ క్యాచర్‌గా పని చేస్తున్నాడు. ఇదిలావుండగా, మంగళవారం రాత్రి ఫుల్చూర్ పరిధి కరంజాలోని ఓ ఇంట్లోకి నాగుపాము దూరినట్లు సునీల్‌కు ఫోన్ వచ్చింది. వెంటనే ఆ ప్రదేశానికి చేరుకున్నాడు.
ఇంట్లో దూరిన పామును చాకచక్కంగా పట్టుకున్నాడు. దాన్ని ఒక సంచిలో వేస్తున్నాడు. ఇంతలో పాము అతని చెయ్యి నుంచి విడిపించుకోని కసితీరా కాటేసింది. వెంటనే.. అతను నొప్పితో విలవిల్లాడాడు. అయిన పామును కాపాడి దగ్గరలోని అడవిలో వదిలేశాడు. ఆ తర్వాత ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లాడు. కానీ అప్పటికే విషం అతని శరీరంలో వ్యాపించింది. చికిత్స పొందుతూ అతను మరణించాడు.
ఈ విషయం తెలియడంతో సునీల్ కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ‘‘పాములను కాపాడి ప్రాణం పోస్తూ.. చివరకు అదే పాము కాటుకు బలయ్యావా’’.. అంటూ బోరున విలపిస్తున్నారు. ఈ ఘటనతో స్థానికంగా విషాదచాయలు అలుముకున్నాయి. కాగా, పాము కాటేసిన ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.