Viral Video: ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ పై కప్పు పై సైకిల్ తొక్కిన యువకుడు.. కట్ చేస్తే సీన్‌లో ఏం జరిగిందో తెలుసా?

Man Riding Bicycle On Roof: ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ పై కప్పు పై ఓ యువకుడు సైకిల్ తొక్కుతూ కనిపించాడు. ఈ ఘటనను స్థానిక ప్రజలు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ గా మారింది.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Jun 7, 2023, 08:19 PM IST
Viral Video: ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ పై కప్పు పై సైకిల్ తొక్కిన యువకుడు.. కట్ చేస్తే సీన్‌లో ఏం జరిగిందో తెలుసా?

 Man Riding Bicycle On Roof: సోషల్ మీడియా వినియోగంలోకి వచ్చిన తర్వాత చాలా రకాల వీడియోలు వైరల్ గా మారుతున్నాయి. అంతేకాకుండా గుర్తు తెలియని వ్యక్తులు కూడా పెద్ద పెద్ద స్టార్లుగా మారుతున్నారు. ఈ వైరల్ అవుతున్న వీడియోలు కొన్ని ఆసక్తికరంగా ఉంటే.. మరికొన్ని నవ్వు పుట్టించే విధంగా ఉంటున్నాయి. ప్రస్తుతం ఎక్కువగా ట్రెండ్ అవుతున్న వీడియోలు జంతువులకు సంబంధించిన ఉండగా.. అప్పుడప్పుడు మనుషులు చేసే చిలిపి చేష్టలకు సంబంధించిన వీడియోలు కూడా ఉంటున్నాయి. ఈరోజు వైరల్ అవుతున్న వీడియో ఒక పక్కన నవ్వు పుట్టించే విధంగా ఉంటే.. మరోపక్క ఆశ్చర్యానికి గురి చేసే విధంగా ఉంది. ఈ వీడియో ఏంటో ? ఈ వీడియోకు సంబంధించిన మరిన్ని వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..

 
 
 
 
 

ఈరోజు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో చూసినట్లయితే.. ఓ వ్యక్తి ఫోటో బ్రిడ్జిపై ఉన్న పైకప్పు పై సైకిల్ తొక్కుతూ సోషల్ మీడియాలో నిలిచాడు. అయితే ఈ సన్నివేశాలను చూసిన అక్కడి స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో వదిలారు. ఇలా పైకప్పుపై సైకిల్ తొక్కడం చాలా ప్రమాదకరమైనప్పటికీ.. మతిస్థిమితం లేకపోవడం వల్ల ఇలా చేశాడని స్థానిక ప్రజలు తెలిపారు. 

Also read: Buttermilk Cautions: మజ్జిగ ఎప్పుడు పడితే అప్పుడు తాగకూడదని తెలుసా, ఎప్పుడు తాగితే మంచిది

పైకప్పు పై ఓ యువకుడు సైకిల్ తొక్కిన వీడియో నెట్టింట తెగ వైరల్ గా మారింది. ఈ వీడియోని చూసి నేటిజన్లు తెగ ఆశ్చర్యానికి గురయ్యారు. అంతేకాకుండా చాలామంది వారి అభిప్రాయాలను కామెంట్ల రూపంలో రాసుకు వచ్చారు.. ఇప్పటికీ ఇలాంటి సాహసం ఎవరు చేయలేరని కామెంట్ల రూపంలో నెటిజన్లు తెలిపారు. కొందరైతే అక్కడున్న స్థానికులు అతన్ని ఆపక ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.

ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ పై కప్పు పైన యువకుడు సైకిల్ తొక్కిన ఘటన బీహార్ రాష్ట్రంలో జరిగిందని తెలుస్తోంది. ఇప్పటివరకు ఈ వీడియోను చాలామంది లైక్ చేయగా.. కొంతమంది వారి అభిప్రాయాలను కామెంట్ల రూపంలో వ్యక్తపరుస్తున్నారు. మరికొందరైతే ఈ వీడియోను చూస్తూ తెగ నవ్వుతూ షేర్ చేస్తున్నారు.

Also read: Buttermilk Cautions: మజ్జిగ ఎప్పుడు పడితే అప్పుడు తాగకూడదని తెలుసా, ఎప్పుడు తాగితే మంచిది

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

  

Trending News