Sunday Astro Rules: జ్యోతిష్య శాస్త్రంలో ఒక్కొక్క గ్రహాన్ని ఒక్కోలా పిలుస్తారు. సూర్యుడిని గ్రహాలకు రాజుగా భావిస్తారు. అందుకే సూర్యుడి కటాక్షం ఉంటే జీవితాంతం ఇక తిరుగుండదు. అలాంటి సూర్యుడితో ఆదివారానికి నేరుగా సంబంధముంది. అందుకే ఆదివారం కొన్ని ప్రత్యేక నియమ నిబంధనలుంటాయి.
హిందూమతం ప్రకారం ఆదివారం అంటే సూర్యుడి ఆరాధనకు అంకితం చేసే రోజుగా భావిస్తారు. ఆదివారం నాడు కొన్ని ప్రత్యేక ఉపాయాలు ఆచరిస్తే సూర్యుడి కటాక్షం లభిస్తుందంటారు. ఈ క్రమంలో ఆదివారం నాడు ఏం చేయాలి, ఏం చేయకూడదనే అంశంపై సూచనలున్నాయి. ఇవి తప్పకుండా పాటించాలంటున్నారు. కొన్ని పనులైతే అస్సలు చేయకూడదు. లేకపోతే చాలా సమస్యలు ఎదుర్కోవల్సి వస్తుంది.
వాస్తవానికి చాలామంది సోమ, గురు, శని వారాల్లో మాంసాహారానికి దూరంగా ఉంటారు. కొంతమంది మంగళ, శుక్రవారాలు కూడా మాంసం తినరు. కానీ ఆదివారం మాత్రం తప్పకుండా మాంసాహారం తీసుకుంటారు. అయితే సూర్యుడి కటాక్షం పొందాలనుకుంటే ఆదివారం నాడు మాంసం, మద్యం అస్సలు ముట్టకూడదని జ్యోతిష్య పండితులు హెచ్చరిస్తున్నారు. ఆదివారం ఈ రెండూ తీసుకుంటే కుండలిలో సూర్యుడి స్థితి బలహీనమౌతుంది. ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ ప్రసరిస్తుంది. ఇంట్లో ధన నష్టం, ఆస్థి నష్టమే కాకుండా వివిధ రకాల అనారోగ్య సమస్యలు చుట్టుముట్టవచ్చు.
మరీ ముఖ్యంగా ఆదివారం నాడు రాగితో చేసిన లేదా సూర్యుడితో సంబంధమున్న ఏ వస్తువునూ విక్రయించకూడదు. దీనివల్ల అశుభ శక్తులు కేంద్రీకృతమౌతాయంటారు. ఆదివారం నాడు పశ్చిమ దిశవైపు ప్రయాణం నిషిధ్దం. ఒకవేళ తప్పనిసరి అయితే ఇంట్లోంచి బయలుదేరేటప్పుడు నెయ్యి లేదా దాలియా తిని బయలుదేరాలంటారు.
అదే విధంగా ఆదివారం నాడు ఎలాంటి బట్టలు ధరించాలనే విషయంపై కూడా సూచనలున్నాయి. ఆదివారం నాడు క్షవరం చేయించడం కూడా నిషిద్ధమంటారు. కానీ చాలామంది ఆదివారం రోజే జుట్టు కత్తిరించడం చేస్తుంటారు. ఆదివారం క్షవరం చేయించడం వల్ల సూర్యుడి స్థితి బలహీనమై..నష్టం వాటిల్లుతుందంటారు. ఈ రోజున నలుపు, నీలం లేదా నీలం రంగు కలిసే బట్టలు ధరించడం అశుభంగా భావిస్తారు.
అన్నింటికంటే ముఖ్యంగా చాలామందికి తెలియని విషయం ఇది. ఆదివారం నాడు ఉప్పు అస్సలు తీసుకోకూడదంటారు జ్యోతిష్య పండితులు. ఆదివారం నాడు ఉప్పు ఎందుకు తినకూడదో కూడా జ్యోతిష్య శాస్త్రం వివరిస్తుంది. జ్యోతిష్యం ప్రకారం ఆదివారం నాడు ఉప్పు సేవిస్తే ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుందట. ముఖ్యంగా ఆ వ్యక్తి చేపట్టే ప్రతి పనిలో ఆటంకం ఎదురుకావచ్చు. సాయంత్రం భోజనం సూర్యాస్తమయం లోగా పూర్తి చేయాలంటున్నారు.
Also read: Saturn Transit 2023: ఈ మూడు రాశులకు జూన్ 2024 వరకూ పట్టిందల్లా బంగారమే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook