Budh Gochar 2023: మేష రాశిలోకి ఈ గ్రహం సంచారం, ఆ రాశులవారి జీవితాల్లో కీలక మార్పులు!

Budh Gochar Negative Impact On Zodiac 2023: ఈ రోజూ బుధ గ్రహం మేష రాశిలోకి సంచారం చేయబోతోంది. కాబట్టి ఈ క్రమంలో పలు రాశులవారికి నష్టాలు కలుగొచ్చు. అంతేకాకుండా మరికొన్ని రాశులవారికి లాభాలు కలిగే అవకాశాలున్నాయి. ఏయే రాశులవారికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.  

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 1, 2023, 10:22 AM IST
Budh Gochar 2023: మేష రాశిలోకి ఈ గ్రహం సంచారం,  ఆ రాశులవారి జీవితాల్లో కీలక మార్పులు!

Budh Gochar Negative Impact On Zodiac 2023: ఈ రోజు సాయంత్రం బుధుడు మేషరాశిలోకి సంచారం చేయబోతున్నాడు. అయితే జ్యోతిష్య శాస్త్రంలో బుధ గ్రహాన్ని మేధస్సు, తార్కిక సామర్థ్యం చిహ్నంగా భావిస్తారు. కాబట్టి ఈ సంచార ప్రభావం అన్ని రాశువాలవారిపై పడే ఛాన్స్‌ ఉందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ ప్రభావం వల్ల కొన్ని రాశులవారికి మంచి జరిగితే మరికొన్ని రాశులవారికి తీవ్ర దుష్ప్రభావాలు కలుగొచ్చని నిపుణులు చెబుతున్నారు. బుధ గ్రహం తన బలహీనమైన మీన రాశి నుంచి మేష రాశిలోకి సంచారం చేయబోతోంది. కాబట్టి ఈ క్రమంలో పలు రాశువారికి చాలా రకాల ప్రయోజనాలు కలిగే అవకాశాలున్నాయి. అంతేకాకుండా ఈ క్రమంలో నష్టాలు కూడా కలుగుతాయి. కాబట్టి తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది. ఈ క్రమంలో ఏయే రాశులవారు ఎలాంటి  ప్రయోజనాలు పొందుతారో  ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ రాశులవారిపై బుధుడి సంచార ప్రభావం:
వృషభ రాశి:

మేషరాశిలోకి బుధుడు సంచారం చేయడం వల్ల వృషభ రాశికి తీవ్ర నష్టాలు కలిగే అవకాశాలున్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. వృషభ రాశికి రెండవ, ఐదవ స్థానంలో ఈ సంచారం జరబోతోంది. కాబట్టి ఈ క్రమంలో లాభాలు తగ్గి ఖర్చులు పెరిగే అవకాశాలున్నాయి. అంతేకాకుండా పెట్టుబడి పెట్టే ముందు జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు.  మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల కూడా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.

కన్య:
కన్యారాశి వారికి బుధుడి సంచారం ఎనిమిదవ స్థానంలో జరగబోతోంది. కాబట్టి ఈ క్రమంలో  దీర్ఘాయువు, ఆకస్మిక సంఘటనలకు దారి తీసే అవకాశాలున్నాయి. కాబట్టి తప్పకుండా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా వీరికి ఈ క్రమంలో జీవితం సవాలుగా మారే ఛాన్స్‌ ఉంది. ఈ సంచారం కారణంగా చర్మ సమస్యలు లేదా గొంతు సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలున్నాయి. ఈ సమయంలో పని రంగంలో కొన్ని మార్పులు లేదా సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. కాబట్టి తప్పకుండా ఆచి తూచి అడుగులు వేయాల్సి ఉంటుంది.

వృశ్చికం:
వృశ్చిక రాశిలో పదకొండవ స్థానంలో బుధుడు సంచారం చేయబోతున్నాడు. ఈ సంచార సమయంలో వృశ్చిక రాశి వారు ఆరోగ్యం పట్ల జాగ్రత్త పాటించడం చాలా మంచిదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ క్రమంలో మీ స్నేహితులు శత్రువులుగా మారే అవకాశాలున్నాయి. కాబట్టి తప్పకుండా వారి పట్ల శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ఈ సంచారం క్రమంలో ఎలాంటి ఆర్థిక నిర్ణయం తీసుకోకుండా ఉండండి. ఈ రాశివారికి భారీగా ఖర్చలు పెరిగే అవకాశాలున్నాయి.

(నోట్‌: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు, సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)

Also Read:  Honey Rose Pics : బాప్‌ రే అనిపించేలా హనీ రోజ్ భారీ అందాలు.. కత్తుల్లాంటి చూపుల్తో కిక్కిస్తోన్న భామ

Also Read: Nithiin Fans : ఫ్లాప్ డైరెక్టర్‌తో నితిన్ సినిమా.. హర్ట్ అయిన అభిమాని.. హీరో రిప్లై ఇదే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Trending News